పెళ్లి కూతురితో సెల్ఫీ ఎంతపని చేసింది (వీడియో)

Updated By ManamWed, 02/14/2018 - 22:25
selfie

selfieకాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ పెళ్లి వేడుక ఉద్రిక్తతకు దారితీసింది. వధూవరుల కుటుంబాలు ఘర్షణకు దిగాయి. పెళ్లి కూతురు చేతిలోనే పెళ్లి కొడుకు చెంపదెబ్బలు తినాల్సొచ్చింది. కాళ్లకు ఉండాల్సిన చెప్పులు గాల్లో కనిపించాయి. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. చివరికి పెళ్లి కళ పోయి ఆ వేడుకే ఓ పీడకలగా ఇరు కుటుంబాలకు మిగిలింది. ఈ గొడవంతటికీ కారణం ఓ వ్యక్తి పెళ్లి కూతురితో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించడం. పూర్తి వివరాల్లోకి వెళితే... కాన్పూర్‌లోని బర్రా తాలూకాలోని ఓ గెస్ట్ హౌస్‌లో ఓ జంట పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత వధూవరులతో బంధువులు ఫొటోలు దిగారు. అయితే ఇలా ఫొటోలు తీసుకుంటున్న సందర్భంలో పెళ్లి కూతురితో పెళ్లికొచ్చిన ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అంతే.. ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి. అతనితో విభేదాలున్నాయో ఏమో తెలియదు కానీ పెళ్లి కొడుకు తరపు బంధువులు ఆ యువకుడిని పెళ్లికూతురి నుంచి దూరంగా లాగి కొట్టారు. ఆ పక్కనే ఉన్న పెళ్లి కొడుకు కూడా గొడవలో తలదూర్చాడు. పెళ్లి కూతురు కూడా తన తండ్రిని కొడుతుండటంతో పెళ్లి కొడుకుతో ఘర్షణకు దిగింది. ఆ క్రమంలోనే ఆమె అతనిపై చేయి చేసుకుంది. ఇంతలో మరో మహిళ చెప్పుతో హల్‌చల్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.

 

English Title
Kanpur: Wedding Pavilion on Selfie, Akaaa, Dulha-bride in a fierce fight-View video
Related News