అర్జున్‌రెడ్డిలో కియరా

Updated By ManamMon, 09/24/2018 - 01:37
Kira in Arjun Reddy

గత ఏడాది తెలుగులో ఘన విజయాన్ని సాధించిన చిత్రాల్లో అర్జున్ రెడ్డి ఒకటి. ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలో ‘వర్మ’ అనే టైటిల్‌తో.. ‘అర్జున్ రెడ్డి’ అనే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్, మేఘా చౌదరి జంటగా నటిస్తున్నారు. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.

image


హీరోయిన్‌గా ముందు తారా సుతారియాను అనుకున్నారు. కానీ ఆమె నటించే వేరే సినిమా డేట్స్ ఈ సినిమా డేట్స్‌కు క్లాష్ కావడంతో ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం కియరా అద్వాని ఇప్పుడు హిందీ అర్జున్ రెడ్డిలో నటిస్తుంది. ధోని చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన కియరా తెలుగులో మహేశ్‌తో ‘భరత్ అనే నేను’లో హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు రావ్‌ుచరణ్ సినిమాలో నటిస్తుంది. 
 

image

 

English Title
Kira in Arjun Reddy
Related News