కత్తులు దూస్తున్న జన సమితి

Updated By ManamMon, 09/24/2018 - 00:38
kodandaram
  • అధికార పార్టీపై చేయి సాధించేందుకు తహతహ

  • పొత్తులతో చిత్తు కాకుండా కాపాడుకోవాలన్న కాంక్ష

kodandaramహైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించిన 105 సీట్ల కుంపటి తెలంగాణలోని అన్ని పార్టీల్లో అగ్గిని రాజేస్తూనే ఉంది. ప్రత్యర్ధి పార్టీల నుంచి తమ ఆభ్యర్థ్ధులు ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు. ఎన్నికల హామీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా... టీఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రం  కేసీఆర్ నినాదంతోనే ప్రచారం చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ గెలుపు బాధ్యత తనదేనని కేసీఆర్ బహిరంగంగా ప్రకటించడంతో పక్క పార్టీల నేతల్లో వణుకు పుటిస్తోంది. ఇదే సమయంలో ఉద్యమ కాలంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం మాత్రం టీఆర్‌ఎస్‌పై కత్తులు దూస్తున్నారు. పదునైన మాటలతో, తనదైన శైలిలో అధికార పార్టీని తూర్పాల పడుతున్నారు.  నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.. రాష్ట్ర ఏర్పాలు తర్వాత తమ ఆకాంక్షలను నెరవేర్చుకోలేదని  ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రత్యేక రాష్త్రోద్యమంలో తాను నిర్వహించిన పాత్రను తెలంగాణ ప్రజలు మరచిపొలేర న్నది టీజేఎస్ నేతల మాట. తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకు వేళ్లాలంటే ఒక్క కోదండ రామ్ కే సాద్యమని నాటి ఉద్యమంలోని పలువురు అగ్ర నేతలు సైతం చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే, టీఆర్‌ఎస్ పార్టీ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను తుంగలో తొక్కిందని ఇది కూడా అ పార్టీని ఒడించేందుకు కారణమని జన సమితి నేతల మాట. ఈ ఆపవాదును టీఆర్‌ఎస్‌ను వీడనంతగా మూట గట్టుకున్నాయని అధికార పార్టీ నుంచి టీకెట్ రాకుండా భంగ పడ్డ అసమ్మతి నేతలు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను టీజేఎస్ మాత్రమే ఓడిస్తుందంటున్నారు.

ఇదిలా ఉంటే, తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలుండగా..కేసీఆర్ ఇప్పటికే 105 ప్రకటించారు. ఇక మిగిలింది 14 సీట్లు మాత్రమే. ఇందులో తమ మిత్ర పక్షమైన ఎంఐఎం 7 ఉండగా..మరొ ఏడే అధికార పార్టీ ప్రకటించలేదు. అసంతృప్తులు వస్తే బలపడదామని బీజేపీ అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తోంది. ఇక కాంగ్రెస్ టీడీపీ మహాకూటమిగా ఏర్పడి పొత్తు లెక్కలు తేలుస్తున్నాయి. కానీ ఇప్పటికీ సీట్లు సర్దుబాటు వ్యవహారంలో ముందుకు పోవడం లేదు. ఇందుకు టీజేఎస్ అద్యక్షుడు కోదండరాం డిమాండ్లే కారణమట.. కామన్ మినిమం ప్రోగ్రామ్ సెట్ చేయాలని.. దానికి తానే చైర్మన్‌గా ఉంటానని కోదండరాం డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం . ఆ కామన్ మినిమం ప్రోగ్రాంను అమరవీరుల కోణంలో డిమాండ్ చేస్తున్నారు కోదండరాం. కానీ దీనివెనుక కోదండరాం ఆలోచన  వేరేలా ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  కోదండరాం చైర్మన్ హోదాలో రేపు మహాకూటమి విజయం సాధిస్తే పాలన మీద పట్టు సాధించాలని వ్యూహం పన్నినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ లక్ష్యంతోనే ఆయన మహాకూటమిలో పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మహాకూటమిలోని పార్టీలన్నీ 25న సమావేశమవుతున్నాయి. అయితే,కాంగ్రెస్ వ్యూహం మాత్రం వేరే రకంగా ఉందట..అమరవీరుల కుటుంబాలకు ఆర్థికసాయంతోపాటు ఉద్యోగ కల్పన వంటి అంశాల వరకూ కోదండరాంను పరిమితం చేయాలని కాంగ్రెస్ భావిస్తోందట..   మిగిలిన అంశాలన్నింటి విషయంలో పెద్దన్న హోదాలో తామే లీడ్ చేయాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉందట.. 25న నిర్వహించే సమావేశంలో తాము అనుకున్న విధంగా కోదండరాం వినకపోతే సీట్ల సర్దుబాటు విషయంలో సీరియస్ గా రియాక్ట్ కావాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారట..  లేనిపక్షంలో కూటమి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ కోరనుందని సమాచారం. ఈ మేరకు పీసీసీ పెద్దలు డిసైడ్ అయినట్టు వార్తలొస్తున్నాయి. దీనితో కోదండరాం వర్సెస్ కాంగ్రెస్ ఎపిసోడే 25న కీలకం కానుంది.

English Title
A knock of swords
Related News