కోదండరామ్‌పై కేటీఆర్ ధ్వజం

Updated By ManamMon, 09/24/2018 - 19:33
KTR, Kodandaram, TJAC leader, Chandrababu naidu, Congress leaders, Telangana state

KTR, Kodandaram, TJAC leader, Chandrababu naidu, Congress leaders, Telangana stateహైదరాబాద్: టీజేఏసీ నేత కోదండరామ్‌పై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హంతక పార్టీలతో పొత్తు పెట్టుకోమని కోదండరామ్‌కు ఏ అమరుడు చెప్పాడని ఆయన విమర్శించారు. సోమవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అమరుల చావుకు కాంగ్రెస్, టీడీపీ కారణం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు తెలంగాణను మర్యాదగా ఇచ్చిందా? అని ప్రశ్నించారు.

వీపు చింతపండు అవుతుందనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని దుయ్యబట్టారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వద్దొని కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 30 లేఖలు రాశారని కేటీఆర్ విమర్శించారు. 

English Title
KTR slams Kodandaram
Related News