మహేశ్ మేనల్లుడి చిత్రం ప్రారంభం

Updated By ManamThu, 10/18/2018 - 10:15
Ashok Galla
Ashok Galla

సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబం నుంచి మరో వారసుడు సినీ ఇండస్ట్రీకి రాబోతున్నాడు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా ‘అదే నువ్వు అదే నేను’ అనే చిత్రం ప్రారంభం అయ్యింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమానికి దర్శకుడు రాఘవేంద్రరావు, సూపర్‌స్టార్ కృష్ణ, దర్శకురాలు మంజుల, గల్లా కుటుంబం తదితరులు హాజరయ్యారు. ఇక ఇందులో అశోక్ సరసన ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నబా నటేశ్ నటించనుండగా, హిప్ హాప్ తమిళ సంగీతం అందించనున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు.

English Title
Mahesh Babu's nephew Ashok Galla movie started
Related News