వైరల్‌గా మహేశ్ లుక్.. వావ్ అంటోన్న ఫ్యాన్స్

Updated By ManamWed, 10/24/2018 - 09:13
Mahesh Babu

Mahesh Babuవంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘మహర్షి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అమెరికాలో జరుగుతుండగా.. అక్కడ చిత్రీకరణలో మహేశ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. వాటిలో మహేశ్ లుక్ అదిరిపోగా.. వావ్ అంటూ ఆయన అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Mahesh's another look leak from Maharshi
Related News