పెళ్లై ఇద్దరు పిల్లలున్నా ఇదేం పని.. ఎఫ్‌బీలో 15మంది..

Updated By ManamTue, 03/13/2018 - 21:35
fb

fbముంబై: అతనికి పెళ్లైంది. వయసు 37 సంవత్సరాలు. ఫేస్‌బుక్‌లో అమ్మాయి పేరుతో, ప్రొఫైల్ పిక్ పెట్టి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఆ అకౌంట్ నుంచి చాలామంది యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. వారిలో 15మంది అతనిని అమ్మాయనుకుని యాడ్ చేసుకున్నారు. వారితో అతను అమ్మాయిలా తరచుగా చాట్ చేసేవాడు. కొన్నిరోజులకు ఫోన్ నంబర్ తీసుకుని మాటలు కలిపేవాడు. ఓ వితంతు మహిళ ఇతని వలలో పడింది. తన ముసుగును తీసేసి అబ్బాయిగా పరిచయం చేసుకున్నాడు. ఆమెను మాటల్లోకి దింపి డబ్బు గుంజే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ మహిళకు సందేహమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బొరివ్లికి చెందిన ఆ మహిళ అతనిని పిలిపించుకుని పోలీసులకు పట్టించడంతో ఈ మోసగాడి బాగోతం వెలుగులోకొచ్చింది. యువతులను మోసం చేసిన ఈ వ్యక్తిని పలండెగా గుర్తించారు. అతనికి పెళ్లై ఇద్దరు పిల్లలున్నట్లు కూడా తెలిసింది. నెట్ నుంచి సెర్చ్ చేసి ఓ మహిళ ఫొటోను ఎంపిక చేసుకుని.. దాన్ని ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని ఇతను మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

English Title
Married man poses as woman on Facebook, cheats 15 women in Mumbai of cash, valuables
Related News