'మహాకూటమి.. మహావైఫల్యం తప్పదు'

Updated By ManamWed, 09/12/2018 - 21:17
Jupalli Krishnarao, Opposition parties, TRS party, KCR, Assembly elections, Massive alliance
  • తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం.. 

  • విపక్షాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజం

Jupalli Krishnarao, Opposition parties, TRS party, KCR, Assembly elections, Massive allianceహైదరాబాద్: రానున్న ఎన్నికల్లో విపక్షాల మహాకూటమి మహా వైఫల్యం చెందబోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు. రాష్ట్రం విశాల ప్రయోజనం కోసమే పొత్తులు కుదుర్చుకుంటున్నట్టు ప్రతిపక్షాలు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడారు. ఈ సందర్భంగా జూపల్లి విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచకపడ్డారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఈ విశాల ప్రయోజనం ఎక్కడికి వెళ్ళింది ?  అని సూటిగా ప్రశ్న లేవనెత్తారు. కేవలం ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ను గద్దె దించడం అనే అవకాశవాదం కోసం ఈ మహా కూటమి ఏర్పడుతుందని దుయ్యబట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ భారీ సంఖ్యలో సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశారు. సురేష్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ టికెట్ ఖరారైనా దాన్ని కాదనుకుని టీఆర్ఎస్‌లో చేరారని జూపల్లి ప్రశంసించారు. 

వనపర్తిలో కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి తాను ఘోరంగా ఓటమి పాలవుతున్నట్టు కార్యకర్తలతో అంటున్నారని, తనకు కాకుండా కాంగ్రెస్ టికెట్ వేరే వారికిచ్చినా బాగుండు అని చిన్నారెడ్డి అంటున్నారని మంత్రి జూపల్లి చెప్పారు. వనపర్తిలో ఈసారి నిరంజన్ రెడ్డి గెలవడం ఖాయమని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్‌ను మహా కూటమి, ఏ మాయల కూటమి ఏం చేయలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని అడ్డుకుంటున్న చంద్రబాబు పార్టీని మహబూబ్ నగర్‌లో తరిమి కొడతారన్నారు. విజయవాడలో పాలమూరు రంగారెడ్డికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన బాబు పార్టీకి మహబూబ్ నగర్‌లో స్థానం లేదన్నారు. ఓట్లు అడిగేందుకు టీడీపీకి ఆ పార్టీతో కలుస్తున్న కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఎవరినో భయపెట్టి టీఆర్ఎస్ గెలవాలనుకోవట్లేదని, గతంలో ఉన్న ప్రభుత్వాలు భయ పెట్టినా ప్రజలు భయపడ లేదని, తెలంగాణ వాదానికే ఓటు వేశారని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. 

English Title
Minister Jupalli Krishnarao slams Opposition parties




Related News