తెలంగాణ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు

Updated By ManamTue, 02/13/2018 - 09:39
Minister Kadiyam Srihari wishes-maha-shivaratri

Minister Kadiyam Srihari wishes-maha-shivaratriహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పండగలు గొప్పగా జరుగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో ఆలయాలను అభివృద్ధి చేస్తూ ధార్మిక కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ అన్ని వర్గాలకు, పండుగలకు తగిన గౌరవం కల్పిస్తున్నారని కడియం తెలిపారు.

"కీసర, వేములవాడలను గొప్పగా అభివృద్ధి చేస్తూ శివాలయాలకు వైభవం తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ఈ కార్యక్రమాలకు అందరూ చేయూతనిచ్చి భాగస్వాములు కావాలని కోరుతున్నాను. ఈ మహా శివరాత్రి ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ మరోసారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు.

English Title
Minister Kadiyam Srihari wishes-maha-shivaratri
Related News