స్వామిగౌడ్‌కు కొనసాగుతున్న చికిత్స

Updated By ManamTue, 03/13/2018 - 19:02
pocharam
pocharam

హైదరాబాద్: సరోజినిదేవి కంటి హాస్పిటల్‌లో శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్‌కు చికిత్స కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు ఆయన్ను ఆస్పత్రిలో పరామర్శించి వెళుతున్నారు. మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి ఆయన్ను పరామర్శించారు. స్వామి గౌడ్‌కు అందిస్తున్న చికిత్సపై డాక్టర్ల దగ్గర వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. గాయం తీవ్రత, చికిత్స వివరాలను డాక్టర్లు మంత్రికి వివరించారు. కంటి గాయం నుంచి స్వామిగౌడ్ త్వరగా కోలుకోవాలని పోచారం ఆకాంక్షించారు.

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజైన సోమవారం గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విసిరిన హెడ్ మైక్ తగిలి స్వామిగౌడ్ కంటికి గాయం కావడం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ప్రభుత్వం...కోమటిరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సభ నుంచి సస్పెండ్ చేసింది.

English Title
Minister Pocharam Srinivas Visits Swami goud in Hospital
Related News