కుప్పకూలిన హెలికాప్టర్..

Updated By ManamSat, 09/08/2018 - 17:04
Missing chopper, crashes, Nepal, air traffic control tower
  • నేపాల్‌లో ప్రమాదం.. దట్టమైన ఫారెస్ట్‌లో ఘటన

  • అదృశ్యమైన చాపర్‌లో ఏడుగురు ప్రయాణికులు..

  • పైలట్ సహా ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం..

  • ఒక మహిళ‌ను రక్షించిన సహాయక సిబ్బంది  

  • ఖాట్మాండుకు 50 కిలోమీటర్ల దూరంలో మిస్సింగ్ 

Missing chopper, crashes, Nepal, air traffic control towerఖాట్మాండు: అదృశ్యమైన అల్టిట్యూడ్ ఎయిర్‌లైన్‌ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. సెంట్రల్ నేపాల్‌లోని ఖాట్మాండుకు 50 కిలోమీటర్ల దూరంలో ధాడింగ్ జిల్లాలో శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఖాట్మాండులోని గోర్ఖా జిల్లా శామగాన్ మీదుగా వెళ్తున్న చాపర్.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ టవర్‌తో ఉదయం 8.05 గంటల ప్రాంతంలో సంబంధాలు తెగిపోయినట్టు ఖాట్మాండు పోస్టు నివేదించింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో జపాన్ పర్యాటకుడు సహా ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఆరుగురు నేపాలీయులుగా అల్టిట్యూడ్ ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నిమ నురు షేర్పా పేర్కొన్నారు. పైలట్ సహా ఆరుగురు ప్రయాణికులు మృతిచెందగా, ఒక మహిళ ప్రయాణికురాలిని అధికారులు రక్షించారు. 

ధాడింగ్ జిల్లాలో ఖాట్మాండుకు 50 కిలోమీటర్ల దూరంలో చాపర్ కుప్పకూలినట్టు స్థానిక మీడియా నివేదించింది. అదృశ్యమైన హెలికాప్టర్ సత్యవతి అనే దట్టమైన అడవిలో కుప్పకూలినట్టు నేపాల్ పౌర విమానాయ అధికారులు ధృవీకరించారు. 5500 అడుగుల లోతున్న అల్టిట్యూడ్ అటవీ ప్రాంతంలో కుప్పకూలిన చాపర్ కోసం గాలించేందుకు సహాయక చర్యలు చేపట్టనప్పటికీ.. వాతావరణం అనుకూలించడం లేదని అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం.. హెలికాప్టర్ నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఉదయం 8.18 గంటల ప్రాంతంలో చేరుకోవాల్సి ఉందని, అంతలోనే ఈ ప్రమాదం జరిగిందని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం జనరల్ మేనేజర్ రాజ్ కుమార్ ఛెత్రి తెలిపారు. 

English Title
Missing chopper with 7 people aboard crashes in Nepal
Related News