నా పై దాడి చేసి చంపాలని చూశారు: బాల్క 

Updated By ManamWed, 09/12/2018 - 15:55
MP Balka Suman Sensational Comments over nallala odelu follower suicide attempt
MP Balka Suman Sensational Comments over nallala odelu follower suicide attempt

చెన్నూరు : ఎంపీ బాల్క సుమన్‌కు చెన్నూరు అసెంబ్లీ టికెట్ కేటాయింపుతో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. చెన్నూర్‌ నియోజకవర్గ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు కాకుండా ఆ సీటును బాల్క సుమన్‌కు కేటాయించడంపై ఓదేలు అనుచరులు నిరసన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. 

జైపూర్‌ మండలం ఇందారంలో బుధవారం శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన బాల్క సుమన్‌కు వ్యతిరేకంగా ఓదేలు అనుచరులు నిరసనకు దిగారు. అంతేకాకుండా బాల్క సుమన్‌ను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఓ కార్యకర్త తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. అయితే అతడితో పాటు మరో నలుగురికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

odelu supporters

ఈ ఘటనపై ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ... టికెట్ కేటాయించిన తర్వాత తొలిసారి నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన తనపై దాడి చేసి చంపాలని చూశారని, తాను చనిపోతే చెన్నూర్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఓదేలు వర్గం వారు చేస్తున్న బెదిరింపులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు.

పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకే తాను చెన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగుతున్నట్లు చెప్పారు. ఆ నెల 14 నుంచి చెన్నూరులో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తానని, చెన్నూరును మరో సిద్ధిపేటలాగా అభివృద్ధి చేస్తానని బాల్క సుమన్ తెలిపారు.

English Title
MP Balka Suman Sensational Comments over nallala odelu follower suicide attempt
Related News