నవాజ్ షరీఫ్ భార్య కన్నుమూత

Updated By ManamTue, 09/11/2018 - 23:20
Begum Culsum
  • కేన్సర్‌తో మృతి చెందిన కుల్సుమ్

  • లండన్‌లోని ఆస్పత్రిలో తుదిశ్వాస

kulsoom-nawazలండన్/ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య బేగం కుల్సూమ్ (68) మంగళవారం లండన్‌లో కన్నుమూశారు. కొద్దిరోజులుగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఇక్కడి హార్లే స్ట్రీట్ ఆస్పత్రిలో పరిస్థితి విషమించి మృతి చెందారు. 2014 నుంచి ఇదే ఆస్పత్రిలో కుల్సూమ్ చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం పరిస్థితి దిగజారడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఊపిరితిత్తుల్లో సమస్య తిరగబెట్టడంతో పరిస్థితి విషమించి కన్నుమూశారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కుల్సూమ్ మృతి విషయాన్ని  పీఎంఎల్‌ఎన్ అధ్యక్షుడు, నవాజ్ షరీఫ్ సోదరుడు అయిన షాబాజ్ షరీఫ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, అవినీతి కేసులో నవాజ్ షరీఫ్, కూతురు మరియం, అల్లుడు మహ్మద్ సఫ్దర్ ప్రస్తుతం రావల్ఫిండి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కుల్సూం అంత్యక్రియలు పాకిస్థాన్‌లోనే నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, ఆమె భౌతికకాయాన్ని తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

English Title
Nawaz Sharif's wife passed away
Related News