అక్టోబర్ 5న నోటా

Updated By ManamMon, 09/24/2018 - 01:24
vijay devarakonda

imageవిజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 5న ‘నోటా’ తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మెహరీన్, సంచనా నటరాజన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతోపాటు విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మరోసారి నటిస్తోంది.

English Title
Nota on October 5
Related News