భూతాపాన్ని నిరోధించడమే లక్ష్యం-2

Updated By ManamMon, 09/24/2018 - 00:50
manam mahI

imageప్ర: ఆర్థికరం గం, లాభాల రేట్లపై వాతావరణ మార్పు ప్రభావం ఉంటుంది కాబ ట్టి పర్యావరణపరంగా చక్కదిద్దుకునేందు కు పెట్టుబడిదారులు కొంతమంది వాదిస్తున్నారు. ఇది సాధ్యవేునా? పెట్టుబడిదా రులు పర్యావరణాన్ని విధ్వంసం చేసేందు కు స్వాభావికంగా ప్రయత్నిస్తున్నారా?

జ: పర్యావరణ దుష్ఫలితాల గురించి పర్యావరణవేత్త, మార్క్సియన్ ఆర్థికవేత్త జేమ్స్ ఓ కానర్ వివాదాస్పదimage  పెట్టుబడిదా రి విధానాన్ని ఈ విధంగా అభివర్ణించారు. ఇది పొరపాటని నాతో పాటు ఇతర మార్క్సియన్ పర్యావరణ ఆర్థికవేత్త పౌల్ బర్కెట్ ఖండించాం. పర్యావరణ మూల్యంతో పెట్టుబడిదారి మూల్యంలోకి మరల్చేందుకు అనుైవెన యంత్రాంగం ఇంతవరకు రూపొందలేదు. ఆ మూల్యాలు నేరుగా సమాజం మీద, భూమి మీద ప్రభావం చూపుతాయి, కానీ ప్రత్యక్షంగా కనిపించవు. ఇది సమస్యగా మారిన తరువాత మానవత్వానికి భద్రత లేనివిధంగా భూగ్రహం తయారవుతుంది. ఆ విధంగా పరిసరాలను నాశనంచేస్తూ మాన వ మనుగడపై ప్రభావం చూపేలా ఆర్థికంగా ఎదుగులకు కారణమవుతాయ నడంలో సందేహపడక్కర్లేదు.

ఇందుకు సాక్ష్యాలు మన చుట్టూనే ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా సమాజంలోని ప్రజలు, భూగ్రహ ప్రయోజనాలను ముం దుకు తీసుకురావాలనేదే మా ఉద్దేశం. అయితే, తగిన మానవ అభివృద్ధితో కూడిన నూతన స మాజం కోసం మార్గాన్వేషణలో ఉన్నామన్నమాట. 

ప్ర: పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పర్యావర ణ స్పృహపై ఉద్యమాన్ని నిర్మించడానికి మంచిమార్గం ఏ మిటంటారు? అలాగే వాతావరణ మార్పుైపె పెట్టుబదారీ విధానానికి వ్యతిరేకంగా నిర్మించాల్సిన ఉద్యమం గురించి ఏం చెబుతారు? 

జ: అణ్యాయుధాల నిరోధం ఉన్నప్పటికీ బ్రిటన్ క్రూయిజ్ క్షిపణులను స్థాపించాలనుకుంటోందంటూ 1979 లో గార్డియన్ పత్రికలో ప్రముఖ ఆంగ్ల మార్క్సియన్ చరిత్రకారుడు ఇ.పి. థాంప్సన్ తెలిపారు. ఆ తరువాత రీగన్ హయాంలో  వ్యూహాత్మక యత్నంగా (స్టార్‌వార్స్‌గా) రూపాంతరం చెందింది. 1950-60 లో హైడ్రోజన్ బాంబ్ పరీక్షల యత్నాలు కొనసాగుతున్న సమయంలో అ ణ్వాయుధ నిరాయుధీకరణ ప్రచారం (సీఎన్‌డీ)లో థాంప్సన్ కీలకపాత్ర పో షించారు. సీఎన్‌డీ అనేది నూతన వామపక్ష భావాలతో ఉద్భవించగా అనం తర కాలంలో లేబర్‌పార్టీ, నాటో కూటమి అమరికగా మారింది. 1970-80 దశకంలో ప్రాణాంతకైమెన అణ్యాయుధ విస్తరణతో సీఎన్‌డీతో సరిపెట్టుకోకుండా నూతన ఉద్యమాన్ని సృష్టించాలని థాంప్సన్ భావించాడు.

అందుకోసం యూరప్ ఉద్యమాలతో సంబంధాలేర్పరచుకుని తూర్పు యూరప్‌తో అలీన ఉద్యమాలతో కలిసి నడవాలని థాంప్సన్ అభిప్రాయపడ్డాడు. థాంప్సన్ ఈఎన్‌డీ వ్యూహం అవెురికాలో తీవ్రప్రభావాన్ని చూ పించి అణ్వాయుధాల స్తంభన ఉద్యమానికి దారితీసింది. ఈ ఉద్యమానికి అమెరికాలో 72 శాతం మంది మద్దతు పలకగా, వారంతా రాజకీయాలకు అతీతంగా ఉండేవారే కావడం గమనార్హం. 1980లో కుదిరిన అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమానికి పునాదిగా ప్రభుత్వాలపై ఒత్తిడితేవడమే కాకుండా భావసారూప్యం గల గ్రూపులు, లాబీయిస్టులతో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయడానికి కారణైమెంది. సమాజంలో కూడా ఉద్యమ ప్రభావం పెరిగేందుకు దోహదపడిం ది. 1930ల్లోని ఫాసిజానికి వ్యతిరేకంగా పనిచేసిన పాపులర్ ఫ్రంట్‌కు కొనసాగింపుగా థాంప్సన్ అభిప్రాయపడ్డారు. ఈఎన్‌డీ, అణ్యాయుధ స్తంభన ఉద్యమం రెండిటితో సమస్యలకు ముగింపు లభించిందనుకోవడం అతిశయోక్తేననడంలో సందేహం లేదు. గోర్బచెవ్ ఎదుగుదలలో మరింత ముం దుకు వెళ్లాల్సిన పరిస్థితులేర్పడ్డాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మా ర్పు వైపు కాకుండా వాతావరణ మార్పు స్తంభన ఉద్యమం దిశగా దృష్టి మ ళ్లించాల్సి ఉందని భావిస్తున్నాను. అంతేగాక  వాతావరణ మార్పు అంశాన్ని మాత్రమే కాకుండా 1980ల్లో అణ్యాయుధ వ్యతిరేక ఉద్యమాన్ని తిరిగి చేపట్టాల్సి ఉంది. పెద్దయెుత్తున ప్రజాఉద్యమాలు పెరగాల్సిన అవసరం ఉందనడంలో సందేహం లేదు. పర్యావరణపరంగా దక్షిణార్థగోళం తీవ్ర పరిస్థితులను ఎదుర్కొనవలసిన నేపథ్యంలో ప్రజాఉద్యమాల అంవసరం ఎైంతెనా ఉంది. ఉత్తరార్థగోళంలో కొండచెరియల అభివృద్ధికి కృషిచేయాలి.

English Title
Objective is to prevent global warming
Related News