దీక్ష విరమించిన హార్దీక్ పటేల్.. 

Updated By ManamWed, 09/12/2018 - 16:48
Patidar Leader, Hardik Patel, Hunger Strike, Patidar reservations

Patidar Leader, Hardik Patel, Hunger Strike, Patidar reservationsగుజరాత్: పాటిదార్ల రిజర్వేషన్ల కోసం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) ఉద్యమ నేత హార్దిక్ పటేల్ దీక్ష విరమించారు. బుధవారం ఆయన దీక్షను విరమించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పటేళ్ల రిజర్వేషన్ల కోసం 19 రోజులుగా హార్దిక్ దీక్ష చేస్తున్నారు. అయితే హార్దీక్ ఆరోగ్యం క్షీణించడంతో తన అనుచరులు, మద్దతుదార్ల అభ్యర్థన మేరకు నిరాహార దీక్షను విరమిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

పటేళ్ల రిజర్వేషన్లు, విద్య, రైతుల రుణమాఫీ కోసం హార్దిక్ తన నివాసం వద్ద ఆగస్టు 25న నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ మంగళవారం హార్దీక్‌ను నిరాహార దీక్షను విరమించాల్సిందిగా కోరారు. ఇటీవల రావత్ అసోం కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రావత్‌.. హార్దీక్ దీక్ష చేసే ప్రాంగణానికి వెళ్లి మద్దతు తెలిపారు. 

English Title
Patidar leader Hardik Patel ends Hunger strike after 19 days
Related News