ట్రంప్ కోడలిపై పౌడర్ దాడి

Updated By ManamTue, 02/13/2018 - 09:53
Donald Trump

vanessa trumpవాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోడలి వానెస్సాపై పౌడర్‌ దాడి జరిగింది. తన ఇంటికి వచ్చిన ఓ పార్సిల్‌ను ఆమె ఓపెన్‌ చేయగా.. అందులోంచి పౌడర్‌ ఆమెపై పడింది. ఆ వెంటనే విపరీతమైన దగ్గు, తలతిరగటం లక్షణాలు కనిపించటంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అది మాములు పౌడర్‌ అని తేల్చేయడంతో ట్రంప్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. మోడల్‌ అయిన వానెస్సా, జూనియర్‌ ట్రంప్‌‌ను వివాహం చేసుకోగా.. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. 

మరోవైపు ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు రహస్య నిఘా విభాగం, ఎఫ్‌బీఐలు రంగంలోకి దిగాయి. అయితే రెండేళ్ల క్రితం ట్రంప్‌ మరో తనయుడు ఎరిక్‌కు కూడా ఇలాంటి పార్సల్‌ ఒకటి వచ్చి కంగారు పుట్టించింది. 2001లో ఆంత్రాక్స్ పౌడర్‌ను ఇలా పార్సల్‌లో పంపి పలువురు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. 

English Title
Trump's Daughter-In-Law Hospitalised After Opening Mail Carrying Powder
Related News