పెళ్లిపై ప్రభాస్ కామెంట్

Updated By ManamTue, 06/19/2018 - 08:30
Prabhas

Prabhas టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లిస్ట్‌లో ప్రభాస్ కూడా ఒకడు. ఇతని పెళ్లి గురించి ప్రభాస్ కుటుంబమే కాదు ఆయన అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ప్రభాస్‌కు తొందరగా పెళ్లి చేయాలని, వధువు కోసం వెతుకుతున్నామని ఇటీవల ప్రభాస్ పెదనాన్న, నటుడు కృష్ణంరాజు కూడా ప్రకటించాడు. ఇలాంటి సమయంలో పెళ్లిపై తన మనసులోని మాటను బయటపెట్టాడు ప్రభాస్.

పెళ్లి తన వ్యక్తిగత విషయమని, దాని గురించి చెప్పడం తనకు ఇష్టం లేదని, చెప్పాలని కూడా అనుకోవడం లేదని ప్రభాస్ అన్నాడు. అయితే తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు మాత్రం తప్పుకుండా మీడియాకు చెబుతానని ప్రభాస్ చెప్పాడు. కాగా ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో అనే చిత్రంలో నటిస్తున్నాడు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Prabhas comment on his Marriage
Related News