ఫ్యాన్స్‌ను ఊరిస్తున్న ప్రభాస్ ట్వీట్

Updated By ManamThu, 10/18/2018 - 10:34
Prabhas

Prabhasరెబల్‌స్టార్ ప్రభాస్ పుట్టినరోజు మరో ఐదు రోజుల్లో రానుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వారిని మరింత ఊరిస్తూ ప్రభాస్ ఓ ట్వీట్ చేశాడు. అక్టోబర్ 23న మీ అందరితో ఓ స్పెషల్‌ను షేర్ చేసుకోబోతున్నా అంటూ ప్రభాస్ సోషల్ మీడియాలో తెలిపాడు. దీంతో అభిమానులలో ఉత్సుకత మరింత పెరిగింది. అయితే ఆ రోజున తన చిత్రాల గురించి ఏదైనా వార్త చెబుతాడేమో అని కొందరు అనుకుంటుండగా.. ఆ రోజు ప్రభాస్ తన పెళ్లి వార్తను చెప్పబోతున్నాడు కాబోలు అంటూ మరికొందరు భావిస్తున్నారు. మరి మొత్తానికి ప్రభాస్ ఏ స్వీట్‌న్యూస్ చెప్తాడో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

 

Dear fans, excited to share something special with you all on 23rd of this month ? Wishing everyone a Happy Dussehra !!

Posted by Prabhas on Wednesday, October 17, 2018

 

English Title
Prabhas's birthday gift
Related News