ఆశా, అంగన్ వాడీలకు గుడ్‌న్యూస్

Updated By ManamTue, 09/11/2018 - 15:52
modi
modi
  • ఆశా, అంగన్ వాడీ వర్కర్లకు వేతనాలు పెంపు   

న్యూఢిల్లీ : ఆశా, అంగన్ వాడీ వర్కర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుడ్ న్యూస్ అందించారు. ఆశా, అంగన్ వాడీ వర్కర్లకు జీతాలు పెంచుతూ ప్రధాని మంగళవారం ప్రకటన చేశారు. ప్రస్తుతం తీసుకుంటున్న రూ.3000వేల వేతనాన్ని రూ.4500 పెంపు, రూ.2200 వేతనం అందుకుంటున్న వారికి రూ.3500 పెంచుతున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆశా, అంగన్ వాడీ వర్కర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని ఈ మేరకు ప్రకటన చేశారు. 


అలాగే  ఆశా, అంగన్ వాడీ సహాయకులకు వేతనం పెంచుతున్నట్లు ప్రకటించారు. అంగన్ వాడీ సహాయకులకు రూ.1500 నుంచి రూ. 2250 పెంచుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే కంప్యూటర్ ఇతర సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన‌ ఉన్నవారికి మరి కొంత నగదు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. నైపుణ్యత ఆధారంగా రూ. 250 నుంచి రూ.500 అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.

English Title
Prime Minister Modi announces hike in remuneration for ASHA and Anganwadi workers
Related News