ఈ నెల‌ 23న ‘రా..రా’

Updated By ManamSun, 02/18/2018 - 21:47
raa raa

raa raaశ్రీకాంత్ , నాజియా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘రా రా’.  శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలవుతుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో హీరో శ్రీకాంత్, నాని, తరుణ్, రఘుబాబు, అలీ, హేమ, సదానంద్, నిర్మాత అశోక్, ప్రతాప్, ఖయ్యుమ్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.  

ఈ సంద‌ర్భంగా నాని మాట్లాడుతూ ‘‘నాకు ‘అష్టాచమ్మా’ నుండి శ్రీకాంత్‌గారితో మంచి పరిచయం ఉంది. నటుడిగా ఆయనేంటో అందరికీ తెలుసు. ఇప్పుడు హారర్ మూవీ ‘రా.. రా’ చేస్తున్నారు. ఈ సినిమా ఆయనకు మరో పెద్ద హిట్ చిత్రంగా నిలవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. తరుణ్ మాట్లాడుతూ ‘‘శ్రీకాంత్‌గారి 125వ సినిమా ఇది. అందరూ కమెడియన్స్ కలిసి ఈ సినిమాలో నటించారు. సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ‘‘శ్రీకాంత్‌గారితో 24 సంవత్సరాల అనుబంధం ఉంది. నా స్వంత బ్రదర్‌లాంటి వ్యక్తి. ఈ కథ విన్న తర్వాత విజయ్ డైరెక్ట్ చేయాలని అనుకున్నాం. శ్రీకాంత్‌గారి వంటి సీనియర్ హీరో ఇలాంటి సినిమా చేయడం గొప్ప విషయం. సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘హాస్యంతో కూడిన హర్రర్ ధ్రిల్లర్ చిత్రమిది. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగటు సినిమా ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. హర్రర్ కామెడీ థ్రిల్ల‌ర్‌ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను. ‘రా..రా ‘చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను. ఈ 23న విడుదలవుతున్న ఈ సినిమా నాకు మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

English Title
'raa raa' on feb 23
Related News