వచ్చీ రాగానే సీబీఐ సెంట్రల్ ఆఫీస్‌లో తనిఖీలు

Updated By ManamWed, 10/24/2018 - 09:31
Nageswara Rao

Nageswara Raoన్యూఢిల్లీ: సీబీఐ కొత్త డైరక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మన్నెం నాగేశ్వరరావు.. వచ్చీ రాగానే తనదైన శైలిలో పని మొదలుపెట్టారు. నియామకపు ఉత్తర్వులను ఈ తెల్లవారుజామున అందుకున్న ఆయన వెంటనే సీబీఐ కేంద్ర కార్యాలయానికి వచ్చి తన సిబ్బందితో తనిఖీలు ప్రారంభించారు. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాలు కూర్చునే గదులతో పాటు, వారి ప్రత్యేక సిబ్బంది గదుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. వారు వాడిన కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లను, ఇతర దస్త్రాలను నాగేశ్వరరావు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. వారితో పాటు దేవేందర్ చాంబర్లలోనూ తనిఖీలు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సోదాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

English Title
Raids on CBI central office
Related News