ముగిసిన పోల్: నోటాకు డేట్ ఫిక్స్

Updated By ManamSat, 09/22/2018 - 12:28
NOTA
NOTA

విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘నోటా’. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదట అక్టోబర్ 4న విడుదల తేదిని ఫిక్స్ చేశారు. అయితే కొన్ని పరిస్థితుల వలన విడుదల వాయిదా పడొచ్చనే వార్తలు వినిపించాయి. ఇలాంటి సమయంలో నటుడు విజయ్ దేవరకొండ ‘నోటా’కు మీరే రిలీజ్ డేట్ చెప్పాలంటూ సోషల్ మీడియాలో ఓ పోల్ నిర్వహించాడు. అందులో అక్టోబర్ 5, 10, 18 తేదీలతో పాటు నోటా అంటూ ఆప్షన్స్ ఇచ్చాడు. 

ఈ పోల్ ఈ రోజు ముగియడంతో ఎట్టకేలకు డేట్‌ను చెప్పేశాడు విజయ్. ‘‘మీరు నోటాకు ఓటు వేశారు, అక్టోబర్ 5కు ఓటేశారు. చెప్పడానికి ఏమీ లేదు అక్టోబర్ 5న రానున్న నోటా’’ అంటూ కామెంట్ పెట్టాడు ఈ సెన్సేషనల్ హీరో. ఇక పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సరసన మెహ్రీన్ నటించగా.. నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఙ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

English Title
Release date fix for NOTA
Related News