రిటైర్డ్ ఎస్పీపై దుండగుల దాడి.. 

Updated By ManamTue, 09/04/2018 - 15:36
Retired cop, 70 beaten to death, public view, Allahabad
  • యూపీలోని అలహాబాద్‌లో ఘటన.. 

Retired cop, 70 beaten to death, public view, Allahabadలఖ్‌నవ్: 70ఏళ్ల అబ్దుల్ సమీద్ ఖాన్ అనే రిటైర్డ్ ఎస్పీపై దుండగులు కర్రలతో దాడిచేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం కిరణా సరుకులు కొనేందుకు బజారుకు సైకిల్‌పై వెళ్తున్న సమీద్ ఖాన్‌ను ముగ్గురు దుండగులు వెంబడించారు. వెనుక నుంచి కర్రలతో వెంబండించి సమీద్‌ను సైకిల్ మీద నుంచి కింద పడేసి కర్రలతో చితకబాదారు. ముందుగా ఓ దుండగుడు కర్రతో దాడిచేయగా, మిగతా ఇద్దరూ జత కలిసి మాజీ ఎస్పీని తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన సమీద్ ఖాన్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రిటైర్డ్ ఎస్పీని ముగ్గురు రోడ్డుపై చావబాదుతున్నప్పటికీ అటుగా వెళ్తున్న వారంతా చూసిచూడనట్టుగా వెళ్లిపోవడం బాధాకారం. సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురి నిందితుల్లో ఇద్దరు మహ్మద్ యూసఫ్, జునైద్‌లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నిందితుల్లో జునైద్ అనే వ్యక్తి పేరిట క్రిమినల్ రికార్డు ఉందని, ఆస్తులకు సంబంధించిన గొడవల వల్లే ఈ దాడికి పాల్పడినట్టు అలహాబాద్ జిల్లా ఎస్ఎస్‌పీ నితిన్ తివారీ చెప్పారు. విచారణ కొనసాగుతున్నట్టు తివారీ తెలిపారు.  

English Title
Retired cop, 70, beaten to death in public view in Allahabad
Related News