రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు 

Updated By ManamTue, 08/21/2018 - 01:01
transport system

imageభారతదేశంలో వీధుల నిర్మాణం కూడా పట్టణ ప్రణా ళికలో భాగమే. ఈ వీధుల్లో కొన్ని సహ జంగా ఏర్పడినవి కాగా, మరికొన్ని ప్రత్యేకంగా నిర్మించినవి. ఇవన్నీ కూడా ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటైనవే. హరప్పా, మొహంజో దారో నుంచి హంపీ విజయనగర రాజుల కాలం, 18 వ శతాబ్దం నాటి జైపూర్ జైసింగ్ కాలం వరకు భారతదేశ చరిత్రలో, ప్రజా జీవితాల్లో వీధి నిర్మాణం అనేది అత్యంత ప్రాధాన్యం సంతరించు కుంది. ఇష్టం వచ్చినట్టు వీధులను నిర్మించడానికి ఏ కాలంలోనూ అవకాశం లేదు. తప్పనిసరిగా పౌరుల రాకపోకలకు అవకాశం కల్పించాలి. ఉదాహరణకు, జైపూర్‌లోని పింక్ సిటీ కోటలో ప్రజల రాకపోకలకు అనువుగా చక్కని వీధులను నిర్మించడం జరిగింది. 

బ్రిటిష్‌వారు భారతదేశంలో స్థిరపడడం ప్రారంభించినప్పుడు వారికి ఇక్కడి భవనాలు, వీధు లు ఒక పట్టాన నచ్చలేదు. తిరగడానికి, నడవడానికి ఏమాత్రం వీలుగా లేవని వారు వీటిని చూస్తూనే గ్రహించారు. అందుకని వారు నగరాల బయట స్వతంత్ర కాలనీలను నిర్మించడం ప్రారంభించారు. రక్షణ విభాగాల కోసం కంటోన్మెంట్లను, అధికారులు, వ్యాపారుల కోసం పౌర ఆవాసాలను ప్రత్యేకంగా నిర్మించారు. ఈ పద్ధతి స్వాతంత్య్రం తరువాత కూడా కొనసాగింది. మాస్టర్ ప్లాన్స్ ప్రకారం రోడ్లను వెడ ల్పు చేయడం, విస్తరించడం లాంటి కార్యక్రమాలను పెద్దయెత్తున చేపట్టారు. వాహనాల రద్దీ పెరుగుతున్న ప్పటికీ, ఇటువంటి విస్తరణ పద్ధతులను లండన్, ప్యారిస్, న్యూయార్క్ వంటి నగరాల్లో కూడా ఏనాడూ చేపట్టలేదు. 

గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో చోటు చేసుకుంటున్న పట్టణీకరణ కారణంగా నగరాలు, పట్ట ణాల్లో వాహనాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగి పోయింది. ప్రభుత్వ వాహనాలే కాదు, ప్రైవేట్ వాహ నాలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు కూడా బాగా పెరిగిపోయాయి. అయితే, నగరాలు పెరుగుతున్నంత వేగంగా ప్రజా రవాణా వ్యవస్థ పెరగడం లేదు. వీధు లు, రోడ్లు సరిగ్గా ఉన్నా లేకపోయినా, అనుకూలంగా ఉన్నా లేకపోయినా వాహనాల సంఖ్య ఎక్కువై పోవ డం మాత్రం అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతోంది. ఇ క ప్రైవేట్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి, కాలుష్యం, ప్రమాదాలు, ఇరుకు పరిస్థితులు, అసౌక ర్యాలు అధికమైపోయాయి. ఇది ప్రమాదకర స్థాయిని దాటిపోయాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 

ప్రభుత్వ వాహనాలకు ప్రాధాన్యం
వాహనాల రద్దీ పెరిగిపోయినప్పటి నుంచీ ప్రభు త్వం దృష్టి వాహనాల రాకపోకలను సుగమం చేయ డం మీద కాకుండా, పాదచారులు, సైకిల్ ప్రయా ణికులు, ప్రభుత్వ రవాణా వ్యవస్థల మీద పడింది. వీటిని ప్రోత్సహించాలనే నిర్ణయానికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి దీని ప్రాధాన్యత అర్థమై 2006 నాటి జాతీయ పట్టణ రవాణా విధానంలో పొందుపర చింది. పట్టణాలలో ప్రాథమిక సదుపాయాల (రవా ణా వ్యవస్థ కూడా) కల్పనకు నిధులు సమకూర్చడమే కాకుండా, పట్టణ పేదలకు అవసరమైన సేవలు సమకూర్చే ఎన్‌టిపి, అమృత్ పథకాలు పట్టణాలలో సజావుగా, సక్రమంగా రవాణా వ్యవస్థలు పనిచేయ డానికి, రోడ్లను విస్తరించడానికి పెద్ద యెత్తున చర్యలు తీసుకుంటున్నాయి. 
పెరుగుతున్న వాహనాల రద్దీ సమస్యను తగ్గించ డానికి, పరిష్కరించడానికి ఇప్పటికే అనేక కార్యక్రమా లు అమలు జరుగుతున్నాయి. వీధుల్లోనూ, రోడ్ల మీదా వివిధ రకాలు ప్రజా రవాణా వాహనాలు తిరుగుతుంటాయి. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం సమీకృతంగా పనిచేయడం లేదు. ప్రభుత్వ బస్సుల వంటి రవాణా సౌకర్యాలను ఉపయోగించుకునేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నప్పటికీ, నాణ్యత లేని బస్సులు, ఇతర వాహనాల వల్ల, ఇరుకు రోడ్ల వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో ప్రయాణికులు, పౌరులు ప్రభుత్వ సర్వీసులను ఉప యోగించుకోవడం తగ్గించి, సొంత వాహనాలను, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలను ఎక్కువగా ఉపయో గించడం ప్రారంభిస్తున్నారు. రోడ్లు నాణ్యంగా లేకపో వడమనేది వాళ్లకూ సమస్యే. 

ఇటువంటి పరిస్థితుల్లో సైక్లింగ్, నడక వంటి అంశాలు కూడా సమస్యగానే ఉంటున్నాయి. వీధులు, రోడ్లలో వాహనాల సంఖ్య పెరిగిపోయి, రద్దీ చేయి దాటి పోవడంతో సైక్లింగ్, నడకలకు ఇబ్బందులు ఏర్పడడమే కాకుండా ప్రమాదాల శాతం కూడా పెరుగుతోంది. సరైన పార్కింగ్ విధానం లేకపోవడం కూడా సమస్యగా పరిణమించింది. దాంతో వీధుల్లో, రోడ్ల మీదా అడ్డదిడ్డంగా ప్రైవేట్ వాహనాలను నిలిపి ఉంచడం కూడా ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. అటు ప్రభుత్వ రవాణా వ్యవస్థ సక్రమంగా లేక పోవడంతో పాటు ఇటు వీధులు కూడా ఇరుకుగా తయారవడంతో ఎక్కువగా మహిళలే ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యవస్థ విషయంలోనూ, ఇటు అసౌకర్యమైన వీధుల విషయంలోనూ ఎక్కువగా స మస్యలు ఎదుర్కొంటున్నది మహిళలే. మహిళలు రాత్రి వేళల్లో ప్రభుత్వ రవాణా వ్యవస్థను ఎక్కువగా ఉపయోగించుకోలేకపోతున్నారని అనేక గణాంకాలతో పాటు, అధ్యయనాలు కూడా తేటతెల్లం చేస్తున్నాయి. దీనివల్ల కొన్ని సందర్భాలలో వారు చదువులకు, ఉద్యోగాలకు, సర్వీసులకు కూడా వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోంది.  
   
కొత్త సర్వీసులకు శ్రీకారం
సాధారణంగా ఇటువంటి సమస్యలకు మరిన్ని రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ రవాణా వ్యవస్థల విస్తరణనే పరిష్కార మార్గంగా చెబుతుంటారు. ప్రజలను, వ్యాపారాలను, ఉత్పత్తులను కూడగట్టడానికి ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ ఆధారిత వేదికలను ఉపయోగించు కోవాల్సి ఉంటుంది. కొనుగోలుదార్లను, అమ్మకం దార్లను కలపడానికి ఈ-కామర్స్ సైట్లను ఉపయో గించినట్టన్నమాట. ఇదే పద్ధతిలో ఓ చిన్న ప్లాట్‌ఫామ్ బస్సు సర్వీసులను, ప్రజలను ఒకే వేదిక మీదకు తీసుకురాగలుగుతుంది. అది జీపీఎస్. దాని ద్వారా బస్సుల రాకపోకలు ముందుగా ప్రజలకు తెలుస్తాయి. తాము ఎప్పుడు, ఎక్కడ ఏ స్టేజీ వద్దకు చేరుకోవాలో ఈ జీపీఎస్ వ్యవస్థ ప్రజలకు మార్గం చూపిస్తుంది. దీనివల్ల వాహనాల వినియోగం, వాహన ఆక్యుపెన్సీ పెరుగుతుందని భావించకూడదు. 

నిజానికి వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా పీర్-టు -పీర్ (పీ2పీ) అనే కొత్త సర్వీసు ప్రారంభం అవు తోంది. ఈ సర్వీసు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఇద్దరు వ్యక్తులు కలిసేలా చేయడం. ఇదివరకటి ప్లాట్‌ఫామ్‌లా కాకుం డా ఇది పూర్తిగా వికేంద్రీకరణ చెందిన ప్లాట్‌ఫామ్. పీ2పీ ఒక రకమైన షేర్డ్ సర్వీస్. ప్రభుత్వ, ప్రైవేట్ సర్వీసులను కలుపుతూ, ఒకే వేదిక మీదకు తీసుకు వ స్తూ, ఒక ఆప్‌ని రూపొందించడం జరుగుతుంది. అం టే ఇక్కడ 1. ప్రైవేట్ పెట్టుబడిని ప్రభుత్వ రవాణా వ్యవస్థకు ఉపయోగించడం ప్రధానాంశం. 2. సర ఫరా, డిమాండ్ల మధ్య ఓ సన్నిహిత సంబంధాన్ని ఏర్పాటు చేస్తారు. 3. రద్దీని, ఇరుకుదనాన్ని తగ్గిం చడం. రద్దీ ఎక్కువైనప్పుడు ప్రయాణికులను రద్దీ ప్రాంతం నుంచి విశాల ప్రాంతానికి దారి మళ్లించడం ఇందులో ముఖ్యమైన భాగం. ఇది రవాణా వ్యవస్థ లోనే ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. 

క్రియాశీల రవాణా వ్యవస్థ
- నగర, శివారు అభివృద్ధి ప్రణాళికల్లో తప్పని సరిగా సాఫీగా వాహనాలు, ప్రజల రాకపోకలు జరగ డానికి ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌లు, వీధి దీపాల వ్యవ స్థల నిర్మాణాలను చేర్చాల్సి ఉంటుంది. వీటిని మరె క్కడికీ బదిలీ చేయడానికి, లేదా దారి మళ్లించడానికి అవకాశం ఇవ్వకూడదు. రోడ్లను లేదా వీధులను బాగుచేసే, మరమ్మతు చేసే పనులు చేపట్టినప్పుడు కూడా ఈ ఫుట్‌పాత్‌లకు, రాకపోకలకు ఏ విధమైన భంగమూ కలగకూడదు.

- ఇక వీధి వ్యాపారులకు కూడా తగినంత స్థలం కేటాయించాలి. వాళ్లు ఎటువంటి ఇబ్బందులకూ గురి కాకూడదు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక విధా నా న్ని రూపొందించాలి. స్మార్ట్ సిటీస్‌లో స్మార్ వీధు లను నిర్మించినట్టు వీరికీ ప్రత్యేక స్థలాలు కేటా యించాలి. 

- ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు నిర్మించడానికి వీలుగా డిజైన్లు (డి.డి.ఎ, ఐ.ఆర్.సి.ఎస్) రూపొందిం చాలి. వీటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించాలి.

- విభాగాలు, ఏజెన్సీల మధ్య సమన్వయం, అవగాహన కుదరడానికి వీలుగా సంస్థాగత ఏర్పాటును ప్రారంభించాలి. 

సమీకృత రవాణా వ్యవస్థ
-ప్రస్తుత వ్యవస్థలో బస్సు, మెట్రో, ఫెర్రీ వంటి వివిధ రవాణా వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఇవన్నీ విభిన్న పద్ధతులను అనుసరిస్తుంటాయి. ఒక్కోసారి వీటికి పొంతన కూడా ఉండదు. ఇందుకు పరిష్కా రంగా ప్రజల వివిధ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, దేశంలోని నగరాలు, పట్టణాలన్నిటిలో ఒక బహుళార్థ సాధక వ్యవస్థ యు.ఎం.టి.ఏను ఏర్పా టు చేయాల్సి ఉంటుంది. ఈ యు.ఎం.టి.ఏ ట్రాఫిక్ రాకపోకల మీద కూడా నిర్ణయాలు తీసుకోవడానికి అధికారం కలిగి ఉంటుంది. ఇటువంటి అధికారం ఇంతవరకూ ట్రాఫిక్ పోలీసులకు మాత్రమే ఉంది. 
- భవిష్యత్తులో నిర్మించే విమానాశ్రయాలు, బస్సులు, రైళ్లు, మెట్రో స్టేషన్లు ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఉండాలి. ఒక రవాణా వ్యవస్థ నుంచి మరో రవాణా వ్యవస్థకు తేలికగా మారడానికి, సమాచారం అందిపుచ్చుకోవడానికి, అన్నిటిలోనూ ఒకే టికెట్‌పై ప్రయాణం చేయడానికి వీలుగా పరిస్థితులు ఏర్ప డాలి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది.

- ప్రయాణికులకు, ముఖ్యంగా మహిళా ప్రయా ణికులకు భద్రత కల్పించేవిధంగా రవాణా వ్యవస్థలు చర్యలు తీసుకోవాలి.

-స్టేషన్లకు, రవాణా సౌకర్యాలకు వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు తేలికగా చేరుకోవడానికి అవకాశం ఉండాలి.
- ప్రయాణికులు వివిధ రవాణా వ్యవస్థలను తే లికగా అందుకోవడానికి మల్టీ మొడాలిటీ వ్యవస్థ ప్రో త్సహించాలి. ఇది కేవలం మెట్రోలకు ఫీడర్ సర్వీ సులను ఏర్పాటు చేయడానికే పరిమితం కాకూడదు.

- ప్రత్యేక కారిడార్లు నిర్మించడం ద్వారా బస్సు సర్వీసులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. సేవలను పెంపొందించడానికి, ఎక్కువ సంఖ్యలో ప్రయాణి కులను తీసుకు వెళ్లడానికి, సమయం ఆదా చేయడా నికి వచ్చే అయిదేళ్లలో బస్సుల సంఖ్యను రెట్టింపు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన బృహ త్ కార్యక్రమంలో ఇంధన వినియోగం, ఇంధన ఆదా వంటి అంశాలను కూడా చేర్చాల్సి ఉంటుంది. 

- పన్నులు పెంచడం వంటి ఆర్థికపరమైన చర్య లు తీసుకోవడం ద్వారా ప్రైవేట్ వాహనాల కొను గోలును నిరుత్సాహపరచాలి. పన్నుల పెంపు వల్ల వ చ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ రవాణా వ్యవస్థ మెరుగు దలకు వినియోగించాలి. ఇక ప్రైవేట్ వాహనాలు పార్కింగ్ చేసే స్థలాలకు ఎక్కువ రుసుము వసూలు చేయాలి. ఈ రకంగా వచ్చిన ఆదాయాన్ని కూడా ప్రభుత్వ రవాణా వ్యవస్థకే ఖర్చు చేయాలి.

- నగరాలు, పట్టణాలను విస్తరిస్తున్నప్పుడు బస్ స్టాప్‌లకు, బస్ స్టాండ్లకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
- విద్యుత్ వాహనాలను వాడి పర్యావరణాన్ని కాపాడే ఆపరేటర్లకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు కల్పించాలి.  
(రచయిత కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి. ప్రత్యక్షంగా సమీక్షలు నిర్వహించిన వ్యక్తి. అభిప్రాయాలు వ్యక్తిగతం)

English Title
Revolutionary changes in the transport system
Related News