బాలీవుడ్ హీరోయిన్.. హైదరాబాద్ షాపింగ్

Updated By ManamThu, 06/14/2018 - 12:26
sara
Sara Ali Khan

దేశం మొత్తం రంజాన్ సందడి ప్రారంభమైంది. ఈ క్రమంలో హైదరాబాద్ చార్మీనార్ ఏరియాలో మరింత సందడి నెలకొంది. రంజాన్ షాపింగ్‌కు చార్మీనార్ ఏరియా పెట్టింది పేరు కావడంతో సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు కూడా అక్కడకు వస్తూ తమకు కావాల్సినవి కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తనయ, హీరోయిన్ సారా అలీ ఖాన్ కూడా షాపింగ్‌కు హైదరాబాద్ వచ్చింది. తన తల్లి అమ్రితా సింగ్‌తో కలిసి ఆమె చార్మీనార్ దగ్గర షాపింగ్ చేసింది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతున్నాయి. కాగా సింబా సినిమాతో (టెంపర్ రీమేక్‌తో) సారా అలీ ఖాన్ బాలీవుడ్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.

English Title
Sara Ali Khan shopping in Hyderabad
Related News