హాకీ శిక్షణ శిబిరానికి సర్దార్ సింగ్

Updated By ManamFri, 04/27/2018 - 02:02
IMAGE

imageబెంగళూరు: కామన్‌వెల్త్ క్రీడల్లో ఆడిన భారత జట్టులో చోటుదక్కని   మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌పై హాకీ సమాఖ్య మళ్లీ కరుణ చూపింది. శుక్రవారం నుంచి బెంగళూరులో ప్రారంభం కానున్న జాతీయ హాకీ శిక్షణా శిబిరంలో పాల్గొనేందుకు  ఎంపిక చేసిన 55 మంది ఆటగాళ్ల జాబితాలో సర్దార్ సింగ్‌కు చోటు కల్పించింది. మే 18 వరకు జరిగే ఈ శిక్షణ శిబిరం నుంచి 48 మంది ఆటగాళ్లను ఎంపిక చేస్తారు.  కామన్‌వెల్త్ క్రీడల్లో ఆడిన హాకీ జట్టులో ఉన్న 18 మంది ఆటగాళ్లతో పాటు మాజీ ఆటగాళ్లు రమణ్‌దీప్ సింగ్,  సురిందర్‌కుమార్, బిరేంద్ర  లక్రా, డిప్సన్ టిర్కీ, నీలమ్ సంజీప్‌లు బెంగళూరు క్యాంప్‌కు ఎంపిైకెన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.  కామన్‌వెల్త్ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత హాకీ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. వచ్చే ఆగస్టులో జరిగే ఆసియా క్రీడల కోసం పటిష్ఠంగా తయారయ్యేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించనుంది. కామన్‌వెల్త్ క్రీడల్లో ఓటమి పాఠాలు నేర్పిందని, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించామని  హాకీ జట్టు చీఫ్ కోచ్ జోర్డ్ మారీన్ చెప్పాడు.

English Title
Sardar Singh for the hockey training camp
Related News