మానవత్వానికే మచ్చ

Updated By ManamMon, 09/24/2018 - 00:38
babu
  • ఈ తరహా దాడులు.. హత్యలు సరికావు.. ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి

  • గిరిజనుల అభ్యున్నతికి కిడారి సేవలు.. ఇద్దరి కుటుంబ సభ్యులకు సానుభూతి

  • విమానం నుంచే ముఖ్యమంత్రి సమీక్ష.. అమెరికా పర్యటనలో సీఎం చంద్రబాబు

babuఅమరావతి: విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. దాడి గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రమకు గురయ్యారు. జరిగిన దారుణం గురించి ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అరకు ఏజెన్సీలో మావోయిస్టుల దాడిని ముఖ్యమంత్రి ఖండించారు. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభ్యన్నతికి కిడారి, సివేరి చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన సానుభూతి తెలిపారు. ఈ తరహా దాడులు, హత్యలు మానవత్వానికే మచ్చ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యవాదులందరూ ఈ దాడిని ఖండించాలన్నారు. ఏజెన్సీ ప్రాంత గ్రామాల అభివృద్ధికి, గిరిజనుల సంక్షేమానికి ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ చేసిన సేవలు నిరుపమానమని ముఖ్యమంత్రి కొనియాడారు. గ్రామదర్శినిలో పాల్గొనే ప్రజాప్రతినిధులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అరకు ఘటన నేపథ్యంలో గ్రామదర్శినిలో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులకు కల్పించే భద్రతపై తక్షణం జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంవో ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్‌పీలతో ఫోన్‌లో సీఎంవో అధికారులు మాట్లాడారు.

విమానంలోనే సమీక్ష
ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా బయల్దేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య విషయం తెలియడంతో.. విమానంలోనే ఆయన అధికారులతో సమీక్షించారు. విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడారు. దుర్ఘటన ఎలా జరిగిందో ఆయనకు జిల్లా అధికారులు వివరించారు. విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో శాంతిభద్రతలకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. హోం మంత్రి, జిల్లా మంత్రులు తక్షణం ఘటనా స్థలానికి వెళ్లాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో హత్యలకు తావులేదని, ప్రజాప్రతినిధులను కాల్చిచంపడం ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ అని అన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని.. ప్రజాసంఘాల వారు, అభ్యుదయవాదులు అందరూ దీన్ని ఖండించాలని ఆయన చెప్పారు.     

English Title
Scarcity of humanity
Related News