కెనడా ప్రధానిని కలిసిన కింగ్‌ఖాన్

Updated By ManamWed, 02/21/2018 - 10:30
Shah Rukh Khan

Shah Rukh Khanవారం రోజుల భారత పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పర్యటనలో భాగంగా పలువురిని కలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులను కూడా కలుసుకున్నారు ట్రూడో. సినీ, వాణిజ్య ప్రముఖులు పాల్గొన్న ఓ కార్యక్రమానికి హాజరైన ట్రూడోను షారూక్ ఖాన్, ఫర్హాన్ అక్తర్, అనుపమ్ ఖేర్ తదితరులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో తీసుకున్న ఫొటోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే తాను షారూక్ ఖాన్‌తో కలిసి తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ట్రూడో.. భారత్, కెనడా చిత్ర పరిశ్రమలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు.

English Title
Shah Rukh Khan met Canada prime minister
Related News