షారూక్ నా ఫేవరేట్

Updated By ManamWed, 02/21/2018 - 03:29
human robo sofia

మానవాళితో కలిసి పనిచేస్తా: ‘మానవ’ రోబో సోఫియా
డబ్ల్యూసీఐటీ సదస్సులో..కృత్రిమ మేధపై ప్రసంగం
 

sofia roboహైదరాబాద్: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ తన ఫేవరెట్ యాక్టర్ అంటూ హ్యూమనాయిడ్ రోబో సోఫియా పేర్కొంది. తన చిట్టి చిట్టి మాటలతో ‘అందర్నీ ప్రేమించండి’ అని చెప్పి హైదరాబాదీల మనసులు గెలుచుకుంది. ఐటీ ప్రొఫెషనల్స్ కోరుకునే విశ్రాంతి, తనకూ కావాలని చెప్పి వారి హృదయాలను కొల్లగొట్టింది. హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ ఐటీ సదస్సు రెండో రోజు రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తనను తయారుచేసిన డేవిడ్ హాన్సన్‌తో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చింది. తాను పుట్టిన హాంకాంగ్ అన్నా, షారుఖ్‌ఖాన్ అన్నా తనకిష్టమని తెలిపింది. మానవాళిపై ఆధిపత్యం చెలాయించాలని తనకు లేదన్న సోఫియా, అందరితో సఖ్యతగా మెలగాలని కోరుకుంటున్నానని చెప్పింది. మానవ జన్మ ఒక అద్భుతమని, మానవులు సృజనాత్మకత కలిగినవారని కొనియాడింది. తనకు పౌరసత్వం ఇచ్చిన సౌదీ అరేబియాకు సోఫియా కృతజ్ఞతలు తెలిపింది. మహిళల హక్కుల గురించి మాట్లాడేందుకు తనకు ఈ పౌరసత్వంhuman robo sofia ఉపయోగపడుతుందని చెప్పిన సోఫియా, తమకు (రోబోలకు) ఎలాంటి ప్రత్యేక నిబంధనలూ అవసరంలేదన్నది. వాటిని తాము కోరుకోబోమని చెప్పింది. మానవ జాతిని చంపాలని ఉందని ఒకసారి అన్నావుగా? అని అడగ్గా.. ‘‘అలా ఎందుకు చెప్పానో నాకు నిజంగా తెలియదు. ఆ సమయంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ పనిచేయలేదేమో. నాకు ఎవరినీ చంపాలని లేదు. అందర్నీ ప్రేమించండి. థాంక్యూ!’’ అని చెప్పి ఇంటర్యూ ముగించింది.

1.5 లక్షల ఉద్యోగాలు: కేటీఆర్
ktrసదస్సులో కృత్రిమ మేధస్సు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో నాస్కామ్ రెండు ఒప్పందాలను కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్, నాస్కామ్ చైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మంగళ వారం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ విస్తరణకు తోడ్పడుతున్న నాస్కామ్‌కు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకెళ్తుం దన్నారు. ఏఐసీవోఈ విషయంలో తెలంగాణ రాష్ట్రమే ముందడుగేసిందని చెప్పారు. డేటా సైన్స్‌లో విస్తృత ఉపాధి అవకాశాలున్నాయని మంత్రి తెలిపారు. అన్ని రంగాలతో ముడిపడి ఉన్న డేటాసైన్స్‌తో లక్షా 50వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయన్నారు. రెండో రోజు సదస్సులో వివిధ అంశాలపై జరిగిన చర్చలో పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

English Title
Shahrukh is my favorite
Related News