ధావన్ ఖాతాలో మరో రికార్డు

Updated By ManamSat, 09/22/2018 - 12:14
Shikhar Dhawan

Shikhar Dhawanటీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మరో అదురైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టిన ధావన్.. ఆ ఘనత సాధించిన ఏడో భారత ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. శుక్రవారం బంగ్లాదేశ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు ధావన్. ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ దేశ ఆటగాళ్లు నజ్ముల్లా హుస్సేన్, షకిబుల్ హసన్, మెహిదీ హాసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ క్యాచ్‌లను ధావన్ అందుకున్నాడు. గతంలో ఈ రికార్డును సునీల్ గవాస్కర్, అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, మొహమ్మద్ కైఫ్, వీవీఎస్ లక్ష్మణ్ సాధించారు. 

English Title
Shikhar dhawan creates unique record
Related News