‘లవ్వా.. పువ్వా.. గుంజీలు తీయండి’

Updated By ManamWed, 02/14/2018 - 21:24
lovers

loversఅజ్మీర్: ప్రేమికుల రోజున రాజస్థాన్‌లో శివసేన మద్దతుదారులు ఓ ప్రేమ జంటపై దాడి చేశారు. అజ్మీర్‌లో మహారాణా ప్రతాప్ సమరక్ ప్రాంతంలో శివసేనకు చెందిన కొందరు కార్యకర్తలు, మహిళా కార్యకర్తలకు ఓ ప్రేమ జంట కనిపించింది. లవర్స్‌ను చుట్టుముట్టిన శివసేన కార్యకర్తలు యువకుడిపై దాడి చేశారు. అతనితో గుంజీలు కూడా తీయించారు. యువతిని కూడా హెచ్చరించారు. అజ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఇదే తరహా ఘటనలు జరిగినట్లు తెలిసింది. జైపూర్‌లో ప్రేమ జంటలు సంచరించే ప్రదేశాల్లో వారిపై ఎలాంటి దాడి జరగకుండా పోలీసులు పర్యవేక్షించారు.
 

English Title
Shiv Sena Hindustan goons beat, harass young couple in Ajmer
Related News