రాజగోపాల్ రెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసులు

Updated By ManamMon, 09/24/2018 - 20:32
MLC Rajagopal reddy, Show cause note, TPCC, Congress High command

MLC Rajagopal reddy, Show cause note, TPCC, Congress High commandహైదరాబాద్: తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. గాంధీభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కమిటీ నిర్ణయించింది. చైర్మన్ కోదండ రెడ్డి అధ్యక్షతన రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో ఈ మేరకు సోమవారం రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని కమిటీ నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘన అంశాలపై సుదీర్ఘంగా సమావేశంలో కమిటీ చర్చించింది. రాజగోపాల్ రెడ్డి మూడు పేజీలు వివరణ ఇచ్చినప్పటికీ క్రమశిక్షణ అంశాలపై  సమాధానం ఇవ్వలేదని కమిటీ భావించింది. 

గతంలో ఇచ్చిన నోటీస్ కు 48 గంటలలో రాజగోపాల్ ఇచ్చిన నోటీస్‌కు కమిటీ సంతృప్తి చెందలేదు. మునుగోడు‌లో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు, నోటీస్ ఇచ్చిన తరువాత ప్రెస్‌మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలను కమిటీ తీవ్రంగా తప్పు పట్టింది. ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ జవాబు ఇవ్వాలని కమిటీ రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాగా, కమిటీ సమావేశంలో కమిటీ  కన్వీనర్ అనంతుల శ్యామ్ మోహన్, సభ్యులు నంది ఎల్లయ్య,  కమలాకర్, సంభాని చంద్రశేఖర్, సీజే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ కుంతియాపై ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు రెండురోజుల్లో వివరణ ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీకి చెందిన ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగిస్తూ  కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను ఏర్పాటు చేసింది. 9 అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను నియమించింది. 

English Title
Show Cause notices to MLC Rajagopala reddy
Related News