క్వార్టర్ ఫైనల్లో సింధు, సైనా

Updated By ManamFri, 04/27/2018 - 02:31
SAINA
  • ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్  

imageవాన్ (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత  స్టార్లు సింధు, సైనా నెహ్వాల్ విజయపరంపర కొనసాగుతోంది.  వరుస విజయాలతో సింధు, సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.  ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా 21-17 21-08 స్కోరుతో చైనాకు చెందిన గో ఫ్యాంగ్జిని చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో సైనా అన్ సీడెడ్ కొరియా క్రీడాకారిణి లీ జంగ్ మితో పోటీపడుతుంది. మరో మ్యాచ్‌లో కామన్‌వెల్త్ క్రీడల రజత పతక విజేత సింధు 21-12, 21-05 స్కోరుతో చైనాకు  చెందిన చెన్ జియాన్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.

శ్రీకాంత్, ప్రణయ్ ముందంజ
పురుషుల విభాగంలో మాజీ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్‌లు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చైనా ప్రత్యర్ధి వాంగ్ కి విన్సెంట్ పోటీ నుంచి తప్పుకోవటంతో శ్రీకాంత్ విజయం సులుైవెంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో శ్రీకాంత్ మూడు సార్లు ఒలింపిక్ రజత పతక విజేత  లీ చెంగ్‌తో తలపడతాడు.  మరో మ్యాచ్‌లో ప్రణయ్  16-21, 21-14, 21-12 స్కోరుతో  చైనీస్ తైపీ ప్లేయర్ వాంగ్ జుని కష్టపడి ఓడించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు.  మరో మ్యాచ్‌లో సింగపూర్ ఓపెన్ చాంపియన్ ప్రణీత్ 12-21, 12-21 స్కోరుతో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ చేతిలో చిత్తయ్యాడు.  మహిళల డబుల్స్‌లో మేఘన- పూర్విషా జంట 9-21, 9-21 స్కోరుతో  థాయిలాండ్ జోడి చేతిలో ఓటమి పాలైంది

English Title
SINDHU, SAINA IN QUARTER FINAL
Related News