సౌర విద్యుత్ పెట్టుబడులకు

Updated By ManamTue, 09/11/2018 - 22:22
Solar power
  • సీఎల్పీ ఇండియా సిద్ధం

Solar powerన్యూఢిల్లీ: సంయుక్త రంగంలో రెండు సౌర విద్యుదుత్పాదన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు సి.ఎల్.పి ఇండియాతో చేతులు కలుపనున్నట్లు విండ్ టర్బైన్ తయారీ సంస్థ సుజలాన్ మంగళవారం వెల్లడించింది. మహారాష్ట్రలోని ధులే 50 మెగావాట్లతో ఒకటి, 20 మెగావాట్లతో మరోటి ప్రాజెక్టులు నెలకొల్పనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సి.ఎల్.పి ఇండియా, సుజలాన్ గ్రూప్ మధ్య 2018 సెప్టెంబర్ 10న సంతకాలు జరిగాయి. సుజలాన్ నెలకొల్పిన రెండు స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్.పి.వి) గేల్ సోలార్ ఫార్మ్స్ లిమిటెడ్, టోర్నడో సోలార్‌ఫార్మ్స్ లిమిటెడ్‌లలో  49 శాతం వాటా స్వీకరించేందుకు సి.ఎల్.పి ఇండియా అంగీకరించింది. భవిష్యత్తులో మిగిలిన 51 శాతం వాటా స్వీకరించే అవకాశం కూడా సి.ఎల్.పి ఇండియాకు ఉంది. హాంకాంగ్ స్టాక్ ఎక్చ్సేంజిలో లిస్ట్ అయిన సి.ఎల్.పి హోల్డింగ్స్ లిమిటెడ్‌కి సి.ఎల్.పి ఇండియా అనుబంధ సంస్థగా ఉంది. భారతీయ విద్యుదుత్పాదన రంగంలో పెట్టుబడులు పెట్టిన పెద్ద విదేశీ సంస్థల్లో అది ఒకటి. అది రూ. 14,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు మాట ఇచ్చింది. సుజలాన్ షేర్ ధర బి.ఎస్.ఇలో రూ. 7.17 వద్ద కోట్ అవుతోంది.

English Title
Solar power investments
Related News