క్రికెటర్ కుమారుడి ఆత్మహత్య

Updated By ManamWed, 02/21/2018 - 00:47
Muhammad Zaryab

Muhammad Zaryabకరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఆమిర్ హనీఫ్ కుమారుడు మహ్మద్ జర్యబ్ మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని హనీఫ్ ధ్రువీకరించారు. కోచ్‌ల వల్ల తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పిన హనీఫ్ పాకిస్థాన్‌లో ఆండర్-19 క్రికెట్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మలిర్‌లోని ఇంట్లో తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు జర్యాబ్ ఉరేసుకున్నాడు. ‘ఎలాగూ నా కుమారుడు ఇక రాడు. కానీ ఇతర పిల్లలను కాపాడండి’ అని హనీఫ్ అన్నారు. ఇటీవల లాహోర్‌లో జరిగిన అండర్-19 టోర్నీలో కరాచీకి జర్యాబ్ ప్రాతినిధ్యం వహించాడు. అయితే గాయం పాలైన జర్యాబ్‌ను మళ్లీ జట్టులోకి తీసుకుంటామని కోచ్‌లు భరోసా ఇచ్చి ఇంటికి పంపారు. కానీ తర్వాత పూర్తి ఫిట్‌నెస్‌తో వస్తే వయసు ఎక్కువుందన్న కారణంగా అతడిని జట్టులోకి తీసుకోలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన జర్యాబ్ అత్మహత్య చేసుకున్నాడు. 

English Title
Son of former Pakistani cricketer commits suicide
Related News