ఒకరిపై పోరాటాన్ని ఆపేస్తున్నా

Updated By ManamWed, 04/25/2018 - 10:28
srireddy

srireddyఒకరిపై చేస్తున్న పోరాటాన్ని ఆపేస్తున్నానని నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తెలిపారు. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలోని పలువురిపై కామెంట్లు చేస్తూ వస్తున్న శ్రీరెడ్డి తాజాగా పేరును చెప్పకుండా ఒక వ్యక్తిపై పోరాటాన్ని ఆపుతున్నానంటూ పేర్కొన్నారు.

మా నిరసనలు కొనసాగుతున్నాయి. ఎవరిపైనా ప్రత్యేకంగా ఆగ్రహం లేదు. అయితే ఒక వ్యక్తి ప్రవర్తనతో బాధపడ్డాము. ఆయనపై చేస్తున్న పోరాటాన్ని ఆపేస్తున్నాము. కానీ నా పోరాటం టాలీవుడ్‌లోని సమస్యలపైనే ఉంటుంది. ఎవరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోను. నా కన్నా ఎక్కువ నా పోరాటానికే ప్రాధాన్యతను ఇస్తాను. థ్యాంక్యు అంటూ పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. అయితే పేరు చెప్పకపోయినప్పటికీ శ్రీరెడ్డి వ్యాఖ్యలు పవన్‌ను ఉద్దేశించినవని పలువురు నెటిజన్లు అంటున్నారు.

English Title
Sri Reddy stop war against one person
Related News