స్టార్ సిటీ ప్లస్ కొత్త వేరియంట్

Updated By ManamMon, 09/24/2018 - 22:20
tvs

tvsన్యూఢిల్లీ: దేశీయ మోటార్ సైకిల్ దిగ్గజం టీవీఎస్ మోటార్స్ కొత్త వేరియంట్ స్టార్ సిటీ ప్లస్‌ను సోమవారం ఆవిష్కరించింది. దీని ధర రూ. 52,907 (ఢిల్లీ ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది. 110 సీసీతో వస్తున్న ఈ బైక్ సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ (ఎస్‌బీటీ), డ్యుయల్ టోన్ మిర్రర్స్‌ను కలిగి ఉంది. ఎస్‌బీటీ బ్రేకింగ్ సిస్టమ్ సమన్వయంతో ముందు, వెనుక  చక్రాలు రెండింటిని ఒకే సారి నిలుపుతుంది. ఇది బైక్ స్కిడ్ అవడానికున్న  అవకాశాన్ని తగ్గిస్తుంది. మార్కెట్లో ఇంత వరకు ఉన్న అన్ని 110 సీసీ ఇంజన్ ద్విచక్ర వాహనాల్లో  ఎస్‌బీటీని అందిస్తున్న కంపెనీ టీవీఎస్ మాత్రమేనని కంపెనీ పేర్కొంది.

English Title
Star City Plus is the new variant
Related News