గెలిచారు.. టీ20లో కూడా అద‌ర‌గొట్టారు!

Updated By ManamSun, 02/18/2018 - 22:16
match
  • ధావన్ ధనాధన్

  • చెలరేగిన భువనేశ్వర్

  • తొలి టీ20లో భారత్ విజయం

  • 28 పరుగులతో సఫారీల ఓటమి

  • ఇది ట్వంటీ 20ల్లో దక్షిణాఫ్రికాపై భారత్ అత్యధిక స్కోరు

matchజోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి ట్వంటీ 20 మ్యాచ్‌లో టీమిండియా 28 పరుగులతో విజయం సాధించి శుబారంభం చేసింది. శిఖర్ ధావన్ (72: 39 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడగా..  రోహిత్ శర్మ 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 21, విరాట్ కోహ్లీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులతో రాణించారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. సఫారీల ముందు 204 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు భువనేశ్వర్ (5/24) చుక్కలు చూపించాడు. ఇతని ధాటికి దక్షిణాఫ్రికా (20 ఓవర్లలో) 175/9 పరుగులు మాత్రమే చేయుగలిగింది. 

దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యం సాధించింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిని దక్షిణాఫ్రికాకు ఆరంభంనుంచే భువనేశ్వర్ కట్టడి చేశాడు. నిప్పులు చెరిగే బంతులతో హడలెత్తించాడు. ఇతని ధాటికి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ భారీ పరుగులు చేయుడంలో విఫలవుయ్యారు. సఫారీ జట్టులో ఓపెనర్ హెండ్రిక్స్ 50 బంతుల్లో (70) పరుగులు, బెహండ్రెన్ (39) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలవుయ్యారు. దీంతో సఫారీ జట్టు 28 పరుగులతో ఓటమి పాలైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు పడగొట్టగా, ఉనద్కాట్, పాండ్యా, చాహల్ తలొ వికెట్ తీశారు. భువనేశ్వర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. మ్యాచ్ తొలి ఓవర్లోనే  రోహిత్ శర్మ తనైదెన శైలిలో విరుచుకుపడ్డాడు. ప్యాటర్సన్ వేసిన మొదటి ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఫోర్ సాయంతో రోహిత్ విజృంభించి ఆడాడు. దాంతో తొలి ఓవర్‌లోనే భారత్ 18 పరుగులను సాధించింది. అదే ఊపును రెండో ఓవర్‌లో కూడా కొనసాగించే క్రమంలో రోహిత్ అవుటయ్యాడు. డాలా వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి కీపర్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 23 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన సురేశ్ రైనా దూకుడుగా ఆడే క్రమంలో రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. డాలా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రైనా 7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 15 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ సమయంలో ధావన్‌కు జత కలిసిన కెప్టెన్ కోహ్లి భారత ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా 8.2 ఓవర్లలో 100 పరుగులను పూర్తి చేసుకుంది.

కానీ, ఈ సమ‌యంలోనే కుదురుగా ఆడుతున్న కోహ్లీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగుల వద్ద  షమ్సి బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 108 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఒకైవెపు వికెట్లు పడుతున్న.. మరోవైపు ధావన్ మాత్రం నిలకడగా ఆడుతూ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఫెహ్లకోహియో వేసిన ఇన్నింగ్స్ 15 ఓవర్ నాల్గో బంతిని వికెట్ల వెనక్కి హిట్ చేయబోయి కీపర్‌కు సునాయస క్యాచ్ ఇచ్చి ధావన్ అవుటయ్యాడు. విధ్వంసర ఇన్నింగ్స్ ఆడిన ధావన్ 39 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత  ధోని (16) ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. చివర్లో మనీష్ పాండే (29 నాటౌట్), హార్దిక్ పాండ్యా(13 నాటౌట్)లు జట్టు స్కోరును 200 పరుగులకు దాటించారు. సఫారీ బౌలర్లలో డాలా రెండు వికెట్లు తీయుగా, మోరిస్, షమ్సీ, ఫెహ్లకోహియోలకు తలో వికెట్ దక్కించుకున్నారు.

English Title
team india win the first t20 against south africa
Related News