అసెంబ్లీ రద్దుపై పిటిషన్ కొట్టివేత

Updated By ManamWed, 09/12/2018 - 12:54
Petition against TS Assembly Dissolution In

Telangana Assembly Dissolution petition dismissed by high courtహైదరాబాద్ : తెలంగాణ శాసనసభ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. అసెంబ్లీ రద్దును సవాల్‌ చేస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రాజ్యాంగం, చట్టాలు ఉల్లంఘించినట్లు పిటిషన్‌లో కనిపించడం లేదని పేర్కొంది. రాజ్యాంగం, చట్టాల ఉల్లంఘన జరగనప్పుడు తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టేసింది.

కాగా తెలంగాణ రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు పరిపాలించమని ప్రజలు అధికారాన్ని యిచ్చారని, కానీ, 9 నెలల కాలం ఉండగానే ముఖ్యమంత్రి సరైన కారణాలు లేకుండా ప్రభుత్వాన్ని రద్దు చేయడం దారుణమని న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అసెంబ్లీని రద్దు చేయడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన పిటిషన్‌లో తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలను నిర్వహించడం వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని భాస్కర్ ప్రస్తావించారు. ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకు ఎలాంటి ఎన్నికలు జరగకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో భాస్కర్ కోరారు.

English Title
Telangana Assembly Dissolution petition dismissed by high court
Related News