ఇంకా ఎంతో సాధించాలి

Updated By ManamSun, 09/16/2018 - 00:15
movie plus

imageప్రేక్షకుడిని కట్టిపేడేసే మాయాజాలం సినిమా...దర్శకుడు అన్ని శాఖలను ముందుండి నడిపించే నాయకుడు. అయితే ఆయన తన కథ ద్వారా ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నారో ఒకపక్క దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటూ.. మరో పక్క సినిమా బడ్జెట్ పరిమితిని పరిగణనలోకి తీసుకుంటూ దర్శకుడి ఆలోచనకు అద్భుతైమెన దృశ్య రూపాన్ని ఇచ్చే సాంకేతిక నిపుణుడే ఛాయాగ్రాహకుడు. అలాంటి బ్యూటీఫుల్ విజువల్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తూ వరుస విజయాలను అందుకుంటున్న సినిమాటోగ్రాఫర్ మణికంఠన్‌తో మనం ఇంటర్వ్యూ...

నేపథ్యం...
నేను సినిమాటోగ్రాఫర్ అవుతానంటే మా ఇంట్లో ఏమీ అనలేదు. సాధారణంగా ఇంటర్‌మీడియట్‌లో ఎం.పి.సి, బై.పి.సి గ్రూపులో జాయిన్ అవమంటారు. నేను ఫోటోగ్రఫీలో ఒకేషనల్ గ్రూప్ జాయిన్ అవుతానంటే నాన్నగారు ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే మా తాతగారు స్టిల్ ఫోటోగ్రాఫర్. మా నాన్నగారికి కూడా ఫోటోగ్రఫీ హబీ ఉండేది. అందువల్ల నేను  పదవ తరగతి పూర్తయిన తర్వాత ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో ఒకేషనల్ గ్రూపులో జాయిన్ అయ్యాను. ఇండియాలో ఒకేషనల్ గ్రూపులో స్పెషల్ ఫోటోగ్రఫీ కోర్సు చోలై మేడీ కార్పొరేషన్ స్కూల్‌లో మాత్రమే ఉంది. దాంతో అక్కడే జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఆడయార్‌లోని ఎం.జి.ఆర్.ఫిలింస్ ఇన్‌స్టిట్యూట్‌లో  డి.ఎఫ్.టెక్ కోర్సు చేశాను. కోర్సు పూర్తయిన తర్వాత శరవణన్‌గారి వద్ద అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాను. మనోజ్ పరమహంస వద్ద కెమెరా డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాను. తెలుగులో ‘ముకుంద’ నా తొలి సినిమా. నా వర్క్‌కి చాలా అప్రిషియేుషన్ వచ్చింది. తొలిరోజు వర్క్‌లో జాయిన్ అయినప్పుడు ఎంత ఆసక్తిగా ఉన్నాన ఇప్పుడు కూడా అదే ఇంట్రెస్ట్‌తో ఉన్నాను. ప్రతిరోజును నా తొలిరోజుగానే భావిస్తా.
 

image


సన్నివేశాలకు అనుగుణంగా...
ఓ సినిమాటోగ్రాఫర్ విజువల్స్‌ను కెవెురాలో చక్కగా చూపించేలా సన్నివేశాలను ప్లాన్ చేసుకోవాలి. అందుకు తగిన విధంగా కలర్స్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసేలా సీన్‌ను డిజైన్ చేసుకోవాలి. ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టు ఒక్కొక్క సంసృ్కతి ఉంటుంది. దానికి తగిన విధంగానే ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ప్రతి దర్శకుడికి ఓ విజువల్ సెన్స్ ఉంటుంది. దానికి తగిన విధంగా దర్శకుడితో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అయితే ముందుగా టెక్నీషియన్‌ని కూడా దర్శకుడు నమ్మాలి. అందుకు తగిన విధంగా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉన్నప్పుడే వారు సన్నివేశంలో ఎలాంటి ఎమోషన్‌ను క్యారీ చేయాలనుకుంటున్నారో అది తెరపై కనపడుతుంది. 

కొన్నిసార్లు వారిపై ఆధారపడాలి...
కొన్నిసార్లు లోకల్ టాటెంట్‌ను వాడుకోవాల్సి ఉంటుంది. అది కూడా లొకేషన్‌కు తగిన విధంగా.. ఉదాహరణకు ‘గీతగోవిందం’లో అన్నవరం క్షేత్రంలో సన్నివేశాలుంటాయి. ఆ సన్నివేశాల్లో మన ప్రొడక్షన్ డిజైనర్స్‌ను ఉపయోగిస్తే నేచరల్ లుక్ మారిపోతుందేమోననిపించింది. అందుకనే అన్నవరం గుడికి లైట్ డెకరేట్ చేసే వాళ్లను కాంటాక్ట్ చేశాం. వాళ్లు ఎలా డెకరేట్ చేస్తారో తెలుసుకుని.. అందుకు తగిన విధంగా డెకరేట్ చేశాం. 

టెక్నీషియన్‌గా అప్‌డేట్ అవుతుంటాను..
మార్కెట్‌లో డిజిటల్ కెవెురాకు సంబంధించి రెడ్, ఆరి కెవెురాలుంటాయి. వాటిలో ఓ సినిమాటోగ్రాఫర్‌గా ఆరి  అలెక్సా imageకెవెురాతో పిక్చైరెజ్ చేయడానికి ఇష్టపడతాను. ఇందులో లెటెస్ట్‌గా ఆరి అలెక్సా ఎస్‌ఎక్స్‌టి కెవెురా వచ్చింది. దాన్ని ఉపయోగిస్తున్నాను. ఓ టెక్నీషియన్‌గా అప్‌డేట్ అవడానికి ప్రయుత్నిస్తుంటాను. సినిమాటోగ్రఫీకి సంబంధించిన కొత్తగా ఏం వచ్చిందని తెలుసుకుంటూ ఉంటాను.  

తెలుగులో తొలి అవకాశం...
మా గురువుగారు శరవణన్‌గారి దర్శకత్వంలో రూపొందిన ‘సిపాయి’ సినిమాకు నేనే కెవెురావెున్‌ని. ఆ సినిమా ట్రైలర్ విడుదైలెనప్పుడు అది చూసిన శ్రీకాంత్ అడ్డాలగారు నన్ను కాంటాక్ట్ చేశారు. అప్పటికే అదే నిర్మాతలు చేసిన రేసుగుర్రం సినిమాకు మనోజ్ పరమహంసతో కలిసి పనిచేసి ఉన్నాను. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా నిర్మాతలు కలిశాను. 

తెలుగు ప్రేక్షకుల గొప్పతనమదే..
imageతెలుగు సినీ ప్రేక్షకులు మంచి సినిమాలను బాగా ఆదరిస్తారు. సినిమాలను ప్రేథియేుటర్‌లో చూసి ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకుల శాతం ఇక్కడ ఎక్కువ. దర్శక నిర్మాతలు సినిమాను ఓ లక్ష్యంగా చేసుకుని మంచి సినిమా కోసం మేకింగ్‌లో ఎక్కడా కాంప్రైమెజ్ కాకుండా నిర్మిస్తారు. సినిమా బావుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఎంకరేజ్ చేయడం తెలుగు ప్రేక్షకుల గొప్పతనం.అది చాలా సార్లు ప్రూవ్ అయింది. 

ఆ విషయం బాగా తెలుసు...
సినిమా బడ్జెట్ అనేది.. కెవెురామెన్ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది. నేను అసోసియేట్ కెవెురావెున్‌గా 15 సినిమాలకు పని చేశాను. కాబట్టి ఎక్కడా బడ్జెట్‌ను కంట్రోల్ చేయాలో బాగా తెలుసు ఒకవేళ సన్నివేశాన్ని రిచ్‌గా తీయాలంటే కూడా ముందుగానే దర్శక నిర్మాతలకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇలా బడ్జెట్‌ణు మనం అడిగి, ఖర్చు పెట్టించి చేసిన సన్నివేశాలు సినిమాలో కనడపడాలనుకుంటాను. 

వారే స్ఫూర్తి..
సీనియర్ సినిమాటోగ్రాఫర్స్ సంతోశ్ శివన్‌గారు.. పి.సి.శ్రీరావ్‌ుగారి కెమెరా వర్క్ అంటే చాలా ఇష్టం. అలాగే బాలు మహేంద్ర గారు, తిరుగారి వర్క్‌ను ఇష్టపడతాను. ఇలాంటి వారు నాకెంతో స్ఫూర్తి. లెన్స్, లైట్ సెట్ చేసుకోవడమే కెమెరా మెన్ పనికాదు. ఓ సన్నివేశానికి తగినట్లు బుర్ర పెట్టి పనిచేయాల్సి ఉంటుంది. 

ఆ రెండింటికీ సంబంధం ఉండదు..
ఓ సినిమాకు ఓవరాల్ బడ్జెట్ ఏంటి? ఎందుకు అంత బడ్జెట్‌ను అనుకున్నారు? అని ముందుగా తెలుసుకోవాలి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. కెవెురావెున్‌కు ఔట్‌పుట్‌ను క్వాలిటీతో అందించే విషయంలో పరిధులుండవు. దానికి బడ్జెట్‌కి సంబంధం ఉండదని నా అభిప్రాయం. 

లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలి...
మనకు తెలిసిన ఒకరిద్దరు అసిస్టెంట్స్‌ను మాత్రం పెట్టుకుని మిగిలిన వాళ్లను ఇక్కడి వాళ్లనే ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు తెలుగులో నేను మూడు సినిమాలకు పనిచేశాను. మూడు సినిమాలకు నా యూనిట్ ప్రతిసారి మారిపోతుంది. నా స్టైల్ ఏంటి? .. ఎలా చేయాలి? అనే విషయాలపై ప్రతిరోజు షూటింగ్ స్టార్ట్ అవడానికి ముందు వివరిస్తాను. దాన్ని బట్టి మనకు కావాల్సిన ఔట్‌పుట్ రాబట్టుకోవాలి. అలాగే సినిమాటోగ్రఫీలో కోర్సు చేసిన వారిని నా టీవ్‌ులోకి తీసుకుంటాననుకోవద్దు. అందరికీ చదువుకునే స్థోమత ఉండకపోవచ్చు కదా!. అనుభవం ఉన్న వ్యక్తులు కూడా నా టీమ్‌లో ఉంటారు. అయితే నా దగ్గర పని చేసే వాళ్లకి సినిమాలంటే ప్యాషన్ ఉండాలి. ‘ఈ సినిమాకు నువ్వే కెవెురామెన్.. నేను కాదు.. అనుకుని పనిచెయ్’ అని నా అసిస్టెంట్స్‌కు ముందుగా చెబుతాను. 

అందుకు సమయం ఉంది...
నేను కెవెురావెున్‌గా ఇంకా ఎంతో సాధించాల్సింది ఉంది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాను. దర్శకత్వం చేస్తాను. అయితే అందుకు చాలా సమయం పడుతుందనే అనుకుంటున్నాను.

కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికే..
నా స్నేహితులు కొందరు ప్రొడక్షన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. నన్ను కూడా వారితో కలవమని అంటున్నారు. నేను ఆలోచనలో ఉన్నాను. ఎన్నో కొత్త కొత్త కథలు వస్తున్నాయి. కొత్త టెక్నీషియన్స్ వస్తున్నారు. నేను ఈ స్టేజ్‌కు రావడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. కాబట్టి కొత్త వారిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదీగాక మనకు నచ్చిన కథలను తెరపై చూసుకోవాలంటే ఇలాంటి ప్రయత్నాలు చేయక తప్పదు.

English Title
There is more to achieve
Related News