నీ కన్నుల్లో కొలిమై రగిలే..

Updated By ManamSun, 09/02/2018 - 10:14
A tribute to YSR on his death anniversary, First single from Yatra
  • వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ‘యాత్ర’ సాంగ్ లిరిక్స్ విడుదల..

A tribute to DYSR on his death anniversary, First single from Yatra

మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘యాత్ర’  చిత్రంలోని పూర్తి పాట లిరిక్స్‌ను ఆ చిత్ర యూనిట్ ఆదివారం రిలీజ్ చేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా... ఆయనపై రూపొందుతున్న యాత్ర బయోపిక్...పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.  ‘నీ కన్నుల్లో కొలిమై రగిలే..కలేదో నిజమై తెలవారెనే.. వెతికే వెలుగే రానీ.ఈనాటి సుప్రభాత గీతమే..నీకిదే అన్నది స్వాగతం’ అంటూ ...వేలాదిమంది వెంటరాగా మహానేత పాదయాత్ర చేస్తున్న దృశ్యాలు ఈ పాటలో కనిపిస్తోంది. 

లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్‌ఆర్ పాత్ర పోషిస్తుండగా, మహి వీ రాఘవ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్నఈ బయోపిక్‌‌ను విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ను నిర్మిస్తున్నారు.  ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రముఖంగా చూపించనున్నారు.

English Title
A tribute to YSR on his death anniversary: First single from Yatra
Related News