'ఆయన తన గొయ్యి తానే తీసుకున్నారు'

Updated By ManamMon, 09/24/2018 - 18:21
Uttam Kumar reddy, KCR, TPCC, Election commission

Uttam Kumar reddy, KCR, TPCC, Election commissionహైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తన గొయ్యి తానే తీసుకున్నాడని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్ లాంటి సీఎంను తానెప్పుడూ చూడలేదన్నారు. సోమవారం ఉత్తమ్ మీడియాతో మాట్లాడతూ బీజేపీ, ఎన్నికల కమిషన్‌తో కలిసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ వచ్చాక దళితులకు మేలు జరుగుతుందనుకున్నామని ఉత్తమ్ అన్నారు. నాలుగున్నరేళ్లు అవుతున్నా ఒక్కరికీ న్యాయం చేయలేదని విమర్శించారు.

ఎస్సీలకు తెలంగాణ కేబినెట్‌లో సరైన ప్రాతినిథ్యం లేదని తెలిపారు. తనకు పిల్లలు లేరని, ప్రజలే తమ పిల్లలని ఉత్తమ్ స్పష్టం చేశారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు మాల, మాదిగలు కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఇసుక మాఫియా ఉందని ఆరోపించారు. ఇసుక కాంట్రాక్టర్లంతా కేసీఆర్ కుటుంబం వారేనని ఉత్తమ్ ఆరోపించారు.       

English Title
Uttam kumar reddy takes on KCR 
Related News