వాట్సాప్‌లో వీడియో గేమ్.. తుపాకీతో కాల్చుకుని మృతి

Updated By ManamTue, 09/11/2018 - 22:22
girl shoots

girl shootsభోపాల్: మధ్యప్రదేశ్‌లో మాజీ పోలీస్ అధికారి కుమార్తె రష్యన్ రౌలెట్ ఆడుతూ తుపాకీతో కాల్చుకుని మరణించింది.  ఢిల్లీలోని తన ఫ్రెండ్ నజ్మాతో వాట్సప్ లైవ్ వీడియో చాట్‌లో కరిష్మా యాదవ్ అనే 21 ఏళ్ల యువతి రష్యన్ రౌలట్ అనే ప్రమాదకరమైన ఆట ఆడినట్టు అధికారులు వెల్లడించారు. మార్కెట్‌కు వెళ్లిన కరిష్మా సోదరుడు ఇంటికి తిరిగి రాగా రక్తపు మడుగులో ఉన్న చెల్లిని చూసి ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె మరణించింది. ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తుండగా తాము వాట్సప్ లైవ్‌లో చాట్ చేసుకుంటూ ఆట ఆడిన తీరును పోలీసులకు నజ్మా వివరించింది. గ్వాలియర్ నగరంలో ఉంటున్న కరిష్మా శుక్రవారం తన స్నేహితురాలితో ‘‘నేను నా లక్‌ను టెస్ట్ చేసుకుంటానని నాకు రివాల్వర్ చూపింది..ఈ రివాల్వర్‌లో కేవలం ఒకే బులెట్ ఉంటుంది, ఆ బులెట్ ఎక్కడుందో నాకు తెలియదు అంటూ తన చెవులకు ఆనించుకుని తుపాకీని ఎక్కుపెడుతూ చూద్దాం నా నొసట ఏం రాసుందో? చావా? బతుకా చూద్దాం అంటూ కాల్చుకుంది..అంతే కాల్ డిస్‌కనెక్ట్ అయిపోయింది..బహుశా అప్పుడే ఆమె కణతిలోకి బుల్లెట్ దూసుకెళ్లి ఉండవచ్చు’’ అంటూ నజ్మా పోలీసులకు వివరించింది.  రివాల్వర్‌లో కేవలం ఒకే ఒక బుల్లెట్ నింపి, చాంబర్‌ను స్పిన్ చేసి, ఇదే రివాల్వర్‌ను తలకు ఆనించుకుని ట్రిగ్గర్‌ను లాగి ఆడే ఆటను రష్యన్ రౌలట్ అంటారు. అదృష్టాన్ని పరీక్షించుకునే ఆటగా పేరుగాంచిన ప్రాణాంతక ఆటైన రష్యన్ రౌలట్  క్రేజీ గేమ్‌గా ఎంతో మంది ప్రాణాలు బలికొంటోంది. 

English Title
Video game in Watsap shot dead with a gun
Related News