ప్రపంచ పండుగ అశోక విజయ దశమి

Updated By ManamThu, 10/18/2018 - 01:32
Ashoka

శాంతికి కేతనంగా, ప్రేమకు చిహ్నంగా, కరుణకు చిరునామాగా, అహింసకు అజారామర రూపంగా నిలిచే, ‘అశోక విజయ దశమి’ తన కరుణా కాంతులతో అతిత్వరలో భార తావనిలో వెలుగులు నింపుతుంది. అశోకుని ధమ్మ విజయ పరిమళాలలో అ ఖండ భారతం  పులకించిపోతుంది. బోధిసత్వ బాబా సాహెబ్ ఆశయం ‘అశోక ధర్మ విజయానికి సంకేతం’గా నిలిచి, బౌద్ధ భారతానికి స్వాగత గీతాలు పలుకుతుంది. శాంతికి, సంక్షేమానికి, సమతకి, సమానత్వానికి, మానవత్వానికి, బుద్ధధమ్మానికి, భాతరదేశ కీర్తికి ఈ పండుగ శాంతి పతాకగా నిలుస్తుంది. అందుకే ఇది ప్రపంచ పండుగ అవుతుంది.

Ashokaవిజయదశమి అంటే అందరికీ గుర్తొచ్చేది ఆయుధ పూజ. మహిషాసురు వధ. ఒక్కొక్క పండక్కి ఒక్కొ క్క పౌరాణిక కథో, చారిత్రక ప్రాధాన్యతో ఉంటుంది. ఆ ప్రాధాన్యత ఆయా మతాల భావజాలానికి అద్దం పడుతుంది. మహిషాసుర మర్థనాన్ని కొత్త రాతి యుగం నాటి మాతృస్వామ్య వ్యవస్థలో జరిగిన వ్యవ సాయ గణ విజయంగా భావించే చరిత్రకారులున్నా రు. పంటపొలాల్ని పాడుచేసే మహా క్రూరమైన అడవి దున్నల బారి నుండి తమ పంటచేలను కాపాడ డానికి వాటితో పోరాడి తరిమేసిన ఒక గణనాయకు రాలి కథే కాలక్రమంలో మహిషాసుర వధగా ఒక మతాచారంగా మారిందనేది కొందరి అభిప్రాయం. అలాగే పురాణ కథల ప్రకారం లంకపై శ్రీరాము ని విజయంగా కూడా విజయ దశమిని భావిస్తారు. అలాగే పాండవులు అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు తమ ఆయుధాల్ని కట్టగట్టి శమీవృక్షం మీద దాచివెళ్తారు. తరువాత కురుక్షేత్ర యుద్ధారంభంలో వాటిని కిందికి దించి, పూజలు చేస్తారు. తాత, తండ్రి, గురువు, బం ధుజనుల వినాశనానికి కారణమైన యుద్ధంకోసం విజయుడు (అర్జునుడు) ఆయుధాల్ని దించిన దశమి కాబట్టి విజయదశమి అని కొందరంటారు. మహిషాసుర మర్థనమైనా, రాముని విజయమై నా, విజయుని యుద్ధ సన్నాహమైనా ఈ కథల న్నింటిలో ఆయుధాలకు పూజ ప్రధానం. 

అందరికీ తెలిసిన విజయదశమి ఇదే!
కానీ, కాలగర్భంలో మరుగునపడి పోయిన మ హామానవీయ ‘విజయ దశమి’ మరొకటి ఉంది. అదే ‘అశోక విజయ దశమి’. ఆయుధాలకు పూజలు మా ని, అహింసోత్సవాలు ఊరూరా జరుపుకున్న మానవీ య మెత్సవం అది. హింసకు స్వస్తి పలికి, మారణా యుధాల్ని మూటకట్టి మూలకు పెట్టేసిన శాంతి మ హాపర్వదినం అది. ఆ అశోక విజయ దశమిని గురిం చి తెలుసుకోవాలంటే మనం క్రీ.పూ. మూడో శతాబా ్దనికి వెళ్ళాలి. కళింగ యుద్ధం గురించి తెలుసుకోవాలి. మౌర్య చక్రవర్తి అశోకుడు మహాయోధుడు. క్రీ. పూ.273లో అన్నను చంపి, తండ్రిని నామమాత్రం గా ఉంచి తాను రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. క్రీ.పూ.269లో పట్టాభిషిక్తుడయ్యాడు. అతని రెండో భార్య విదిశాదేవి. ఆమె బౌద్ధ ధర్మావలంబి. ఆమె కొడుకు మహేంద్రుడు. కూతురు సంఘమిత్ర. వారిద్ద రూ తల్లిదగ్గరే పెరిగి బౌద్ధాన్ని బాగా ఆకళింపు చేసు కున్నారు. వారి గురువు మొగ్గలిపుత్త తిస్స. అశోకుడు క్రీ.పూ. 260లో కళింగపై దండెత్తాడు. దీనికి అనేక కారణాలున్నాయి. తనపై రాజకీయ కుట్ర లు పన్నిన కొందరు కళింగ రాజుల చెంతచేరి, కళింగ యుద్ధానికి కారకులయ్యారు. వద్దనుకున్నా అశోకునికి యుద్ధం చేయక తప్పలేదు. మూడు కళింగ రాజ్యాలు ఏకకూటమిగా నిలిచాయి. వీరికి ‘ఐళ’ నాయకుడు. మౌర్యుల కాల్బలం ఆరులక్షలు. అశ్వకదళం 30 వేలు. గజబలం తొమ్మిది వేలు. కళింగ కాల్బలం రెండు లక్షలు. అశ్వక దళం ఏడువేలు. గజబలం రెండు వేలు. అయినా కళింగలు మహావీరులు. ప్రధానంగా గిరిజనులు. ఆ సంవత్సరం పుష్యమాసంలో పుష్యమీ నక్షత్ర సమయంలో అంటే పుష్యమాస పున్నమినాడు కళింగ యుద్ధం మొదలైంది. పదినెలలు యుద్ధం సాగింది. క్రీ.పూ.261 అశ్వయుజ శుద్ధ నవమితో కళిం గ యుద్ధం ముగిసింది. ప్రపంచం ఇంత ఘోరమైన యుద్ధాన్ని ఎప్పుడూ చూడలేదు. లక్షమంది చనిపో యారు. లక్షన్నర మంది క్షతగాత్రులై జీవచ్ఛవాలై మిగిలారు. లక్షన్నర మంది యుద్ధఖైదీలుగా పట్టుబడి మగధ కారాగారాల్లో బందీలయ్యారు. ఆ మరునాడు ప్రజలు వేడుకల్ని అశోకుని కళింగ విజయానికి గుర్తుగా దేశమంతా ఘనంగా జరుపు కున్నారు. తాను చేసిన నరమేధాన్ని చూసి, అశోకుడు తానే చలించిపోయాడు. విజయం లభించినా, అశాంతితో తిరిగి వచ్చిన అశోకునికి భార్య విదిశాదేవి, బిడ్డలు సంఘమిత్ర, మహేంద్రుల బౌద్ధ సందేశాలు, కొంత ఊరట కలిగించాయి. ఆనాటి బౌద్ధ మహాగురువు మొగ్గలి పుత్తతిస్స (ఉపగుప్తుడు) ప్రబోధాలు విన్న అశోకునిలో కొత్త ఆలోచనలు రేగి, రక్తం అంటని శాంతిభావాలు చిగురించాయి. చండ అశోకుడు ధర్మ అశోకునిగా మారాడు.

తనలోని దుడుకుతనానికి తానే కళ్ళెం వేసుకోవా లనుకున్నాడు అశోకుడు. తాను చేసిన ఈ ఘోరకలిని మరచిపోయేవిధంగా మంచిపనులు చేయాలని నిర్ణ యించుకున్నాడు. ఈ లోపు  కళింగయుద్ధ విజయ ప్రథమ వార్షికోత్స సంబరం రానే వచ్చింది. దేశమం తా విజయోత్సవాలకి సిద్ధమవుతోంది. ఇదే మంచి తరుణంగా భావించాడు అశోకుడు. గట్టి నిర్ణయం తీ సుకున్నాడు. అప్పటికే ఆయన కళింగులకు దగ్గర కావాలనుకుని కళింగ వనిత కారువాకిని కూడా వివా హం చేసుకున్నాడు. (ఆతరువాత ఆమె కుమారుడు తివరునికి కళింగ పాలనా బాధ్యతలు అప్పగించాడు.)
బౌద్ధులకు ప్రతినెలలో 4 రోజులు ఉపవాస దినాలు. అవి శుద్ధ అష్టమి, పున్నమి, బహుళ అష్టమి, బహుళ చతుర్ధశి(అమావాస్య ముందురోజు). వీటిని ‘ఉపోసదలు’ అంటారు. బౌద్ధదీక్ష తీసుకునేవారు ఈ రోజుల్లోనే దీక్ష తీసుకోవాలి. ముందు అనుకున్న ప్రకా రం అశోకుడు క్రీ.పూ. 262 ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజున ‘ఉపాసకునిగా’ (గృహస్తుగా ఉంటూ పంచశీల పాటించడం) బౌద్ధదీక్ష తీసుకున్నాడు. అనుకున్న ప్ర కారమే కళింగయుద్ధంలో పట్టుబడ్డ ఖైదీలందరికీ రెం డున్నర ఎకరాలు భూమిని సర్వ హక్కులతో పట్టాలు ఇచ్చి నవమి రోజున విడుదల చేస్తానని ప్రకటించి  వారందరినీ విడుదల చేశాడు. దశమి రోజున దేశ మంతటా అహింసోత్సవాలు నిర్వహించాలని ప్రకటిం చాడు. అలా అశోకుడు కళింగ విజయాన్ని కరుణ విజ యంగా మార్చాడు. ఆ విజయం ధర్మానికి, అహిం సకు విజయంగా ప్రకటించాడు.
దశమి రోజున ప్రపంచ చరిత్రలో ఏ చక్రవర్తీ చేయని అద్భుతమైన ప్రకటన చేశాడు. ‘ఇక, ఈ రోజు నుండి (ఈ విజయ దశమి నుండి) నేనుగానీ, నా వారసులుగానీ ఎవ్వరూ, ఎ ప్పుడూ యుద్ధాలకి దిగరు. కత్తి చేపట్టరు. కరుణను చేపట్టే పాలన సాగిస్తారు. ప్రజలందరి సంక్షేమం కోస మే రాజ్యాన్ని పాలిస్తారు’ అని ప్రకటించి, ఆయుధా ల్ని మూట కట్టి మూ లకు నెట్టే శాడు. అందరూ భయపడ ్డట్టు సైన్యా న్ని రద్దుచే యకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిం చాడు. ఇక ఆనాటి నుండి ప్రతి విజయ దశమి ‘అశోక విజయ దశమిగా’ దేశమంతటా జరుపుకునేవారు. 
    
క్రీ.పూ. 259లో జంతువుల వేటను కూడా నిషే దించాడు. క్రీ.పూ. 257లో బౌద్ధసంఘ సభ్యుడయ్యా డు. క్రీ.పూ. 232లో అశోకుడు మరణించిన తరువాత అతని మనువడు సంప్రదిన్ పాలకుడయ్యాడు. ఆ తర్వాత క్రీ.పూ.188లో ఆఖరి మౌర్యరాజైన బృహ ద్రదుణ్ణి హత్యచేసి బ్రాహ్మణ సేనాని పుష్యమిత్ర శుంగుడు రాజ్యాన్ని హస్తగతం చేసుకునే వరకూ అశోక విజయ దశమి అహింసోత్సవంగానే జరిగింది. ఆ తర్వాత వైదిక పాలకులు వచ్చి, ఆయుధ పూజలు మొదలు పెట్టారు. ఆ తర్వాత బౌద్ధం క్రమేపీ క్షీణించడంతో అశోక విజయ దశమి ప్రాధాన్యతను పోగొట్టుకుంది. మరలా ఆధునిక కాలంలో దాదాపు 12 వందల సంవత్సరాల తర్వాత చరిత్రలో మరుగున పడిన ఆ మహా మాన వీయ విజయ దశమి చరిత్రని ఆధునిక బోధిసత్త్వుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ బైటకు తీశాడు. 1956, అక్టోబర్ 14న నాగపూర్‌లో విజయ దశమి రోజున ఆరు లక్షల మందితో తానూ బౌద్ధ దీక్ష తీసు కోవడంతో అశోక విజయ దశమిని పునఃప్రారంభిం చాడు. ఈ విజయదశమిని అశోక విజయదశమిగా ప్రకటించాడు. ఇక ఆనాటి నుండి ‘అశోక విజయ దశమి’ వేడుకలు దేశం నలుమూలలకూ వ్యాపించ డం మొదలు పెట్టాయి. మహారాష్ట్రతోపాటు, ఉత్తర ప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అనేక చోట్ల విజయ దశమి వేడు కలు అశోకుని పేర జరుగుతున్నాయి. నాగపూర్‌లో ఎప్పటి నుండో లక్షలాది మందితో ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. గత నాలుగైదు సంవత్సరా లుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక గ్రామా ల్లో, నగరాల్లో అశోక విజయ దశమి ఉత్సవాలు మొదలయ్యాయి. మొన్న అక్టోబర్ 14న (అంబేడ్కర్ బౌద్ధదీక్ష తీసుకున్న రోజున) పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు సమీపంలోని ఉండ్రాజవరంలో మహా ఉత్స వం జరిగింది. ఈ ఉత్సవానికి 30 వేల మందికి పైగా హాజరయ్యారు.

శాంతికి కేతనంగా, ప్రేమకు చి హ్నంగా, కరుణకు చిరునామాగా, అహింసకు అజారామర రూపంగా నిలి చే, ‘అశోక విజయ దశమి’ తన కరుణా కాంతులతో అతిత్వరలో భార తావనిలో వెలుగులు నింపుతుంది. అశోకుని ధమ్మ విజయ పరిమళాలలో అఖండ భారతం  పులకించి పోతుంది. బోధిసత్వ బాబా సాహెబ్ ఆశయం ‘అశోక ధర్మ విజయానికి సంకేతం’గా నిలిచి, బౌద్ధ భారతానికి స్వాగత గీతాలు పలుకుతుంది. శాంతికి, సంక్షేమా నికి, సమతకి, సమానత్వానికి, మాన వత్వానికి, బుద్ధధమ్మానికి, భాతర దేశ కీర్తికి ఈ పండుగ శాంతి పతాకగా నిలుస్తుంది. అందుకే ఇది ప్రపంచ పండుగ అవుతుంది.
 బొర్రా గోవర్ధన్
 9390600157

Tags
English Title
The world festival is Ashoka Vijay Dashami
Related News