తెరపైకి కాల్ సెంటర్ కుంభకోణం

Updated By ManamSun, 09/09/2018 - 06:05
Call center scam
  • చిక్కుల్లో 5 భారతీయ బీపీఓలు  

imageషికాగో: మల్టీ మిలియన్ డాలర్ల కాల్ సెంటర్ కుంభకోణంలో భారతీయ బీపీఓ కంపెనీలు చిక్కుకున్నాయి.  2 వేల మంది అమెరికన్లను 5.5 మిలియన్ డాలర్లకు పైగా నిలువునా ముంచేసినట్టు యూఎస్ న్యాయవిభాగం వెల్లడించింది.  పేడే రుణాల పేరుతో బాధితులను మోసగించడమే కాకుండా పన్నులు చెల్లించని బాధితులకు అరెస్టులు, జైలు, జరిమానాలు బూచిగా చూపించి భయపెట్టారని కూడా అమెరికా అటార్నీ వివరించారు.

 2012 నుంచి 2016 మధ్యకాలంలో సాగిన ఈ కుంభకోణంలో అహ్మదాబాద్‌కు చెందిన ఏడుగురు కుట్రదారులు, ఐదు కాల్ సెంటర్ల పాత్ర ఉన్నట్టు తేలింది.  ఏడుగురు భారతీయులతో పాటు మొత్తం 15 మందిపై కేసులు నమోదయ్యాయి.

English Title
Call center scam




Related News