స్విట్జర్లాండ్‌లో శ్రీదేవి విగ్రహం

Updated By ManamSun, 09/09/2018 - 13:44
Switzerland, Sridevi statue, Switzerland tourism industry, Indian film shot 

Switzerland, Sridevi statue, Switzerland tourism industry, Indian film shot అతిలోక సుందరి శ్రీదేవి విగ్రహాన్ని స్విట్జర్లాండ్‌లో ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు స్వర్గధామంగా నిలిచిన ఆ దేశం.. శ్రీదేవికి నివాళిగా ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశ రాయబారి అధికారి ఒకరు వెల్లడించారు. కాగా శ్రీదేవి విగ్రహానికి అక్కడ ప్రతిష్టించేందుకు కారణం కూడా ఉంది. ఆమె నటించిన పలు బాలీవుడ్‌ చిత్రాల్లో పాటలు చాలా వరకూ స్విట్జర్లాండ్‌లోనే చిత్రీకరించారట. 

అందుకే ఆమె విగ్రహాన్ని అక్కడ నెలకొల్పాలని ఆ దేశం భావిస్తోంది. అంతేకాకుండా శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని స్విట్జర్లాండ్... ఓ హానర్‌గా భావిస్తోంది. అలాగే ఆమె కెరీర్‌లో బిగ్ హిట్‌‌గా నిలిచిన ‘చాందినీ’ చిత్రాన్ని చాలాభాగం ఇక్కడే చిత్రీకరించారు. శ్రీదేవికి నివాళిగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ దేశ పర్యాటక శాఖ నిర్ణయించింది.

ఇప్పటికే స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం ప్రముఖ నిర్మాత యాష్ చోప్రా విగ్రహాన్ని 2016లో  ఇంటర్‌లేకెన్‌లో ఏర్పాటు చేశారు. కాగా యాష్ చోప్రా నిర్మించిన చిత్రాల్లో చాలా వరకూ ఇక్కడే షూటింగ్ జరుపుకున్నాయి. అలాగే చోప్రా పేరు మీద కొన్ని రైళ్లు కూడా ఉన్నాయి. బాలీవుడ్ సినిమాలను ఇక్కడ చిత్రీకరించిన తర్వాత ఆ దేశ టూరిజం విపరీతంగా అభివృద్ధి చెందింది. 

English Title
Sridevi to be honoured by Switzerland with a statue
Related News