telugu desam party

ఎంపీల ఆందోళనతో ఉభయసభలు వాయిదా

Updated By ManamTue, 03/06/2018 - 11:43

 Telugu Desam Party (TDP) MPs stage protest near Mahatma Gandhi statue in Parliamentన్యూ ఢిల్లీ: పార్లమెంట్‌‌లో రెండోరోజు కూడా ఏపీ ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. హోదా అంశంపై చర్చించాలంటూ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు వైసీపీ ఎంపీలు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు. కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ లోపల, వెలుపలా ఏపీ ఎంపీల ఆందోన చేశారు. ఎంపీల ఆందోళనతో లోక్‌సభ సభలు మధ్యాహ్నం 12గంటలకు, రాజ్యసభ 2గంటలకు వాయిదాపడ్డాయి. ఇదిలా ఉంటే.. ఏపీ పీపీసీ ఆధ్వర్యంలో ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష జరిగింది. సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, కనిమొళి, డి. రాజా, రాంగోపాల్ యాదవ్ పాల్గొన్నారు.సీఎం కేసీఆర్‌పై రమణ విసుర్లు

Updated By ManamMon, 02/26/2018 - 13:27
L Ramana

మోస పూరితమైన మాటలు, వాగ్ధాలతో కేసీఆర్ తెలంగాణ సీఎం అయ్యారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ కార్యకర్తల నాయకత్వ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దళిత వ్యక్తిని తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎం చేస్తానంటూ కేసీఆర్ దళిత సమాజాన్ని నమ్మించి వంచించారని  విమర్శించారు. అలాగే రైతుల రుణ మాఫీ, డబుల్ బెడ్‌రూం, దళితులకు మూడెకరాల భూమి, ఉద్యోగ నియామకాలు ఇలా అన్ని హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు.

L Ramana

నీతి, నిజాయితీ కలిగిన నాయకత్వమున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. ఎన్ని ఆటుపోట్టు ఎదురైనా సిద్ధాంతాలకు కట్టుబడి టీడీపీ ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణలోనూ టీడీపీకి మంచి భవిష్యత్తు ఉందన్నారు.దూకుడు పెంచిన పవన్.. వారిద్దరికి ఫోన్

Updated By ManamWed, 02/14/2018 - 22:36

pawanహైదరాబాద్: సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా దూకుడు పెంచాడు. విభజన హామీల్లో కేంద్ర కేటాయింపులపై నిజనిర్థారణ కమిటీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తోన్న పవన్ కళ్యాణ్.. ఇప్పటికే లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌లతో భేటీ అయ్యారు. వీరితో పాటుగా మేథావులు, ఆర్ధిక వేత్తలు కూడా ఈ కమిటీలో భాగస్వాములు అవుతారని ప్రకటించిన పవన్.. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీపీఐ, సీపీఎం కార్యదర్శులు రామకృష్ణ, పి. మధుకు ఫోన్ చేశారు. ఈ నెల 16న హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో హాజరు కావాలని కోరారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తికి వారిద్దరూ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.అర్జంటుగా రూ.5 వేల కోట్లు పంపండి

Updated By ManamWed, 02/14/2018 - 21:57

chandrababuఅమరావతి:  తమ రాష్ట్రానికి అర్జంటు‌గా రూ.5 వేల కోట్లు పంపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. ఇదేదో స్పెషల్ ప్యాకేజ్ నిధుల కోసమో.. విభజన హామీల్లో చెప్పిన లెక్కల సర్దుబాటు కోసమో కాదు.. దాని కథ వేరే ఉంది. కొద్దిరోజుల నుంచి ఏపీ వ్యాప్తంగా ఏటీఎంలలో నగదు నిల్వలు నిండుకున్నాయి. ఏ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లినా నో క్యాష్ బోర్డులు దర్శనమివ్వడమో లేదంటే పెట్టిన నగదు క్షణాల్లో అయిపోవడమో జరుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా ముఖ్యమంత్రి చంద్రబాబు దాకా వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు నాటి పరిస్ధితులు నెలకొన్నాయని.. ఏటీఎంలలో నగదు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. తక్షణం రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల కరెన్సీని పంపాల్సిందిగా జైట్లీ లేఖ రాశారు.ఆయన నిక్ నేమ్ "విజిటింగ్ ప్రొఫెసర్"

Updated By ManamWed, 02/14/2018 - 20:19

galla jayadevఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందిగా టీడీపీ ఎంపీలు చేసిన ఆందోళన జాతీయ స్థాయిలో ప్రాధాన్యతను సంతరించుకుంది. పదిహేను నిమిషాల స్పీచ్‌తో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. ఢిల్లీ నుంచి ఏపీలో ఆయన అడుగుపెట్టగానే బెజవాడ నుంచి గుంటూరు వరకు నీరాజనాలు పలికారు జనం. టీడీపీ శ్రేణులైతే ఏకంగా సన్మానం కూడా చేసేశాయి. అయితే ఇప్పటికే టీడీపీపై రగిలిపోతున్న ఏపీ బీజేపీ శ్రేణులకు జయదేవ్ సన్మానం మరింత ఆగ్రహాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో గల్లా ఏం సాధించారని ఆయనకు సన్మానం చేశారని.. ఏపీ బీజేపీ కార్యవర్గ సభ్యుడు పైడా కృష్ణమోహన్, యువమోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ రాంప్రసాద్ విమర్శించారు. జయదేవ్‌ను గుంటూరు ప్రజలు విజిటింగ్ ప్రొఫెసర్ అని పిలుస్తారని ఆరోపించారు. తమ పార్టీ నేతలకు మాట్లాడే అవకాశమిస్తే అంతకంటే బాగా మాట్లాడతారని అన్నారు. తమతో పొత్తు తెంచుకోవాలని టీడీపీ భావిస్తే తెంచుకుంటామని.. పోటీ పడాలనుకుంటే తాము కూడా పోటీ పడతామని చెప్పారు.పని జరుగుతుందో లేదో డ్రోన్లతో చూడండి

Updated By ManamWed, 02/14/2018 - 19:52

babu

 

 

అమరావతి: పరిపాలనలో టెక్నాలజీని వినియోగించి అద్భుతమైన ఫలితాలను రాబట్టడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది అందెవేసిన చెయ్యి.. ఇలాంటి సంస్కరణల కారణంగానే ఆయన్ను హైటెక్ సీఎంగా అభివర్ణిస్తారు విశ్లేషకులు. తాజాగా నవ్యాంధ్ర పరిపాలనలోనూ సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు రియల్ టైమ్ గవర్నెన్స్, వర్చువల్ విధానం ద్వారా పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలన చేస్తున్నారు ముఖ్యమంత్రి. ఇక తాజాగా అమరావతి నిర్మాణ పనులను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధాని నిర్మాణంపై సచివాలయంలో సీఆర్‌డీఏ అధికారులు, సర్వీస్ ప్రొవైడర్లతో సీఎం సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డ్రోన్లతో తీసిన చిత్రాలను తనకు ప్రతి 15 రోజులకు ఒకసారి చూపించాలన్నారు. పనుల్లో వేగం పెంచి నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసేలా కాంట్రాక్టర్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. వీటిలో ఎవరైనా విఫలమైతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.బెజవాడ కార్పొరేషన్‌లో ముగిసిన వివాదం

Updated By ManamWed, 02/14/2018 - 18:57

tdpవిజయవాడ: విజయవాడ కార్పొరేషన్‌లో గత కొద్దిరోజులుగా మేయర్ కోనేరు శ్రీధర్‌, కార్పోరేటర్లకు మధ్య నెలకొన్న వివాదం ముగిసింది. మేయర్ వైఖరి నచ్చని కొంతమంది కార్పొరేటర్లు తిరుగుబాటు చేయడంతో వివాదం రేగింది. కౌన్సిల్ సమావేశాల్లో ఇష్టమొచ్చినట్లు తిట్టడంతో పాటు పలుమార్లు మేయర్ గొడవ పడుతుండటంతో సహనం నచ్చిన తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పగా.. మేయర్ పదవిపై కన్నెసిన కొందరు కావాలనే తిరుగుబాటును లేవదీశారని.. తాను ఏ తప్పు చేయలేదని.. ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించలేదని శ్రీధర్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతుండటంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు.

విజయవాడ అర్బన్ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చొరవ తీసుకుని వివాదాన్ని పరిష్కరించారు. ఇవాళ కేశినేని భవన్‌లో జరిగిన సమావేశంలో కార్పొరేటర్లతో సమావేశమైన వెంకన్న వారి వాదనలు విన్నారు. అనంతరం మేయర్‌ను తన నివాసానికి పిలిపించి మాట్లాడారు. పార్టీ ఆదేశాల మేరకు కలిసి పనిచేయాలని.. హద్దు దాటితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఇకపై కార్పొరేటర్ల మనసు నొప్పించకుండా పని చేస్తానని.. అందరినీ కలుపుకుని వెళ్తానని మేయర్ శ్రీధర్ తెలిపారు.  టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి మూడేళ్లు జైలు శిక్ష

Updated By ManamWed, 02/14/2018 - 13:39

 TDP MLA Chintamaneni Prabhakar To 6 Months Jail Termఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు వేర్వేరు కేసుల్లో మూడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు భీమడోలు మెజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మొత్తం రెండేళ్లు జైలు శిక్షతో పాటు రూ. 1000 జరిమానా విధించింది. ముఖ్యంగా 2011లో మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై ఎమ్మెల్యే చేయి చేసుకున్న కేసును సీరియస్‌గా తీసుకున్న కోర్టు సుధీర్ఘ విచారణ అనంతరం కోర్టు బుధవారం ఉదయం చింతమనేనికి ఆర్నెళ్లు జైలు శిక్షతో పాటు, రూ.5వేలు జరిమాన విధిస్తూ తీర్పునిచ్చింది.

కేసులివే..

  • 2011లో మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై చేయి చేసుకున్న కేసు- రెండేళ్ల జైలు, రూ.500జరిమానా

  • అదే ఏడాది వట్టి వసంత్ గన్‌మెన్‌ను కొట్టిన కేసు - ఆర్నెళ్లు జైలు శిక్ష, రూ.1000 జరిమానా

  • రచ్చబండలో గొడవ చేసిన కేసు- ఆర్నెళ్లు జైలు శిక్ష, రూ.500 జరిమానా

 

2011లో అసలేం జరిగింది..
2011లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని దెందలూరులో రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రజాసమస్యలపై ఆందోళన చేపట్టారు. దీంతో రచ్చబండ రసాబాసగా మారింది. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్, కావూరి సాంబశివరావు, ఎమ్మెల్యే చింతమనేని మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి లోనైన ఈ నేతల మధ్య తోపులాట జరిగింది.. ప్రభాకర్ మాజీ మంత్రిపై చేయిచేసుకున్నారు.! రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. అప్పట్లోనే ఎమ్మెల్యే ప్రభాకర్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో టీడీపీ-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వట్టి వసంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సుమారు ఏడేళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పునిచ్చింది.టెక్నాలజీలో మాకన్నా చంద్రబాబే ముందున్నారు

Updated By ManamTue, 02/13/2018 - 21:05

ambaniఅమరావతి, ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆకాశానికెత్తేశారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ. సచివాలయంలో చంద్రబాబుతో భేటీ అయిన ముఖేశ్ అనంతరం మీడియాతో మాట్లాడారు.. టెక్నాలజీ వినియోగంలో మాకంటే చంద్రబాబే ముందున్నారని ప్రశంసించారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ అద్భుతంగా ఉందని.. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వ్యవస్థ లేదని.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆర్టీజీఎస్‌ను చూపించాలని అంబానీ కొనియాడారు. ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని.. శ్రీసిటీలో నెలకు 10 లక్షల ఫోన్లను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని ముఖేశ్ తెలిపారు. అనంతరం అంబానీని చంద్రబాబు తన నివాసానికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కుటుంబం ఇచ్చే విందులో ముఖేశ్ పాల్గొంటారు.చంద్రబాబుతో భేటీ అయిన ముఖేశ్ అంబానీ

Updated By ManamTue, 02/13/2018 - 19:02

ambaniదేశంలోనే అత్యంత సంపన్నుడు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అమరావతి పర్యటనలో భాగంగా ముంబై నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మంత్రి నారాలోకేశ్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు అధికారులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ముఖేశ్ అమరావతికి చేరుకున్నారు. ఆర్టీజీ కేంద్రానికి వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో అంబానీ పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌‌‌లో పెట్టుబడులు పెట్టే అంశంపై ముఖేశ్, సీఎంతో చర్చించనున్నారు. 
Related News