daggubati purandeswari

పురందేశ్వరికి కీలక పదవి

Updated By ManamFri, 09/21/2018 - 17:21
  • ఎయిర్‌ ఇండియాలో స్వతంత్ర డైరెక్టర్‌గా పురందేశ్వరి

purandeswari

న్యూఢిల్లీ : బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి కీలక పదవి లభించింది. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలో ఎయిర్ ఇండియాలో స్వతంత్ర డైరెక్టర్‌గా ఆమె నియుమితులయ్యారు. గురువారం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ పరిధిలోని ఎయిర్ ఇండియా లిమిటెడ్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో అనధికార స్వతంత్ర డైరెక్టర్‌గా పురందేశ్వరి నియమితులయ్యారని పేర్కొంది. నియామకాల కేబినెట్ కమిటీ ఈ ప్రతిపాదనను ఆమోదించిందని, మూడేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారని లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. మంత్రులు లేరంతే.. బంధాలు కొనసాగుతాయి..!

Updated By ManamFri, 03/09/2018 - 11:30

మంత్రులు లేరంతే.. బంధాలు కొనసాగుతాయి..!విజయవాడ: "టీడీపీకి సంబంధించిన మంత్రులు కేంద్రంలో.. బీజేపీ వాళ్లు ఏపీ కేబినెట్‌‌లో లేరు అంతే.. అంతమాత్రనా బంధాలెక్కడకీ పోవు. బీజేపీ-టీడీపీ మధ్య బంధాలు కొనసాగుతాయి. ఈ విషయాన్ని టీడీపీ వాళ్లే రెండ్రోజుల నుంచి చెబుతున్నారు" అని బీజేపీ నేత పురందేశ్వరి స్పష్టం చేశారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయం మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగించలేదు. ప్రత్యేక హోదాతో ఏపీకి ఏమీ లాభం ఉండదని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా చెప్పారు. జైట్లీ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏపీకి ఉన్న లోటును భర్తీచేయడానికి కేంద్రం వెనకాడదు.. వెనకాడలేదు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా నిధులు ఇవ్వమని చెప్పిందా?.

ఐఐటీలాంటి నేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏపీలో పెట్టారు..ప్రతీ దానికి కేవలం 10, 15 కోట్ల రూపాయిలు మాత్రమే ఇచ్చారని దుష్ప్రచారం చేస్తున్నారని  ఇది చాలా బాధాకరం. రాష్ట్రంలో ఒక ఐఐటీ స్థాపించి అది క్వాలిటేటివ్‌గా లేకపోతే దానిప్రభావం దేశ వ్యాప్తంగా ఉన్న మిగతా ఐఐటీల మీద పడుతుంది. ఇది నేను స్వయంగా చూశాను. ఏపీలో నిర్మాణానికి తలపెట్టిన వృద్ధికి నిధులు ఇవ్వమని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. ఇలా ప్రతీ విషయంలో కేంద్రం అన్నిరకాలుగా రాష్ట్రాలకు సహకరిస్తోంది. దేశ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణాలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, చంద్రన్న భీమా యోజన, ఏపీలో ఆరు లక్షల ఇళ్లు మంజూరు చేసింది. వీటిన్నంటికి కేంద్రం నుంచే నిధులు వస్తాయి" అని పురందేశ్వరి పేర్కొన్నారు. 

"ఏపీని అన్ని విధాలా కేంద్రం ఆదుకోవడంతో పాటు.. న్యాయం చేస్తుంది. ప్రత్యేక ప్యాకేజీతోనే ఏపీ లాభం. ఏపీకి కేంద్రం పూర్తిగా న్యాయంచేస్తుంది. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ. 2,500 కోట్లు ఇచ్చింది. ఆర్థిక లోటును తీర్చడానికి కేంద్రం తగు చర్యలు తీసుకుంటుంది. ఏపీలో వెనకబడ్డ ప్రాంతాలకు ఇప్పటికే పన్నురాయితీలిచ్చారు. కేంద్ర విద్యాసంస్థలకు తక్కువ నిధులు ఇస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. కేంద్రం చొరవతోనే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి" అని ఆమె స్పష్టం చేశారు.తెలుగుదేశంలోకి పురంధేశ్వరి కొడుకు..?

Updated By ManamMon, 02/12/2018 - 20:55

 daggubati purandeswariతన తండ్రి ఎన్టీఆర్ స్టాపించిన తెలుగుదేశం పార్టీలో తమకు చోటు లేకపోవడం దగ్గుబాటి పురంధేశ్వరి పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పార్టీని, అధికారాన్ని చేజిక్కించుకున్నారనే అక్కసుతో తనభర్తతో కలిసి పార్టీ నుంచి బయటకు వచ్చారు పురంధేశ్వరీ. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పురంధేశ్వరి.. రాష్ట్ర విభజన తర్వాత భర్తతో కలిసి తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారు.. అయితే వీరి రాకను చంద్రబాబు అడ్డుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే తనకు దక్కని అదృష్టాన్ని తన కుమారుడికి దక్కేలా చేయాలని పురంధేశ్వరీ పావులు కదుపుతున్నారట.

తమ కుటుంబానికి పట్టున్న పర్చూరు నుంచి తనయుడు చెంచురామ్‌ను అసెంబ్లీకి పోటీ చేయించాలని ఆమె భావిస్తున్నారట. సోదరుడు బాలకృష్ణ ద్వారా పురంధేశ్వరీ తెర వెనుక నుంచి ఈ వ్యవహారం చక్కబెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటం.. తమ కుటుంబానికి నియోజకవర్గంలో ఉన్న పట్టు తదితర అంశాలు చంద్రబాబుకు తెలియజేయాల్సిందిగా పురంధేశ్వరి.. బాలయ్యతో చెప్పినట్లు పొలిటికల్ టాక్.. ఈ అంశాన్ని బావ.. అల్లుడు లోకేశ్ వద్ద బాలయ్య ప్రస్తావించినట్లు పచ్చ కండువాలు గుసగుసలాడుకుంటున్నాయి.

చెంచురామ్‌కి టికెట్ ఇవ్వడం ద్వారా దశాబ్దాలుగా ఉన్న మనస్పర్థలు తొలగడంతో పాటు నందమూరి, దగ్గుబాటి కుటుంబాల అండ తెలుగుదేశానికి దక్కుతుందని చంద్రబాబు కూడా భావిస్తున్నారట. కుటుంబపరంగానూ.. రాజకీయం గానూ తనకు లబ్ధి చేకూర్చే ఈ అవకాశాన్ని చంద్రబాబు వంటి రాజకీయ మేధావి వదులుకోరని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Related News