venkaiah-naidu

పరస్పర సహకారంతోనే అభివృద్ధి

Updated By ManamTue, 10/09/2018 - 02:41
  • దేశాభివృద్ధిలోయువత పాత్ర కీలకం

  • మనది యువభారత్.. దూసుకెళ్దాం..

  • ప్రగతి కోసం పన్నుల వసూలు తప్పదు

  • బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు

  • వరంగల్ నిట్ వజ్రోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

venkaiah-naiduవరంగల్: పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, యువత దీన్ని గ్రహించి కలిసికట్టుగా దేశ ప్రగతి కోసం కృషి చేయాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్బోధించారు.  భారత దేశంలో యువశక్తికి కొదవలేదని, జనాభాలో 65 శాతం మంది యువతేనని వీరంతా సరికొత్త ఆవిష్కరణలతో సమస్యల పరిష్కారానికి పాటుపడాలని సూచించారు. వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వజ్రోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రూ. 25 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అల్యుమినీ కన్వెన్షన్ సెంటర్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త పరిశోధనలు, నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలని విద్యార్థులకు వెంకయ్య పిలుపు ఇచ్చారు. బతుకమ్మ విశిష్టత ఎంతో గొప్పదంటూ ఆయన బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ఉపయోగపడేలా, వారి జీవితాల్ని సౌకర్యవంతం చేసేలా ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు కొత్త కొత్త ఆవిష్కరణలకు రూపకల్పన చేయాలన్నారు. యువత దేశ వారసత్వాన్ని కాపాడాలని పిలుపు ఇచ్చారు. అత్యాధునిక సాంకేతికతను అవసరాల కోసం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి వాటిని ప్రతిపక్షాలు విమర్శించాయని, అయితే సంస్కరణల ఫలితం వెంటనే కనిపిం చదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సంస్కరణల ఫలితాలు భవిష్యత్తులో..రాబోయే కాలంలో వాటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు కొత్త ఆలోచనలతో సమాజహితమైన పరిశోధనలు చేపట్టాలని ఉపరాష్ట్రపతి  సూచించారు. మాతృభాష కళ్లు అయితే అన్యభాష లు కళ్ల అద్దాల వంటివని ఉపరాష్ట్రపతి వెంకయ్య అభిప్రాయపడ్డారు.ప్రపంచం చూపు భారత్‌వైపు

Updated By ManamSun, 09/09/2018 - 22:38
  • మోదీ నేతృత్వంలో పురోభివృద్ధిలో దేశం.. షికాగోలో తెలుగువారితో ఉప రాష్ట్రపతి వెంకయ్య

venkaiah-naiduషికాగో: ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోందని కొనియాడారు. ప్రపంచ హిందూ కాంగ్రెస్ లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన షికాగోలో తెలుగు వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.  సందర్బంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగమనంలో ఉన్నా యని, కానీ అందుకు విరుద్ధంగా భారత్ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)లు కూడా భారత్ వృద్ధి రేటుపై సానుకూల నివేదికలు వెలువరుస్తున్నాయని చెప్పారు. తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనను 35-40 మంది రాయబారులు కలిశారని, వారందరూ కూడా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపించారని చెప్పారు. విదేశాల్లోని తెలుగువారు కూడా భారత పురోభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ సమావేశానికి వందల మంది తెలుగువారు హాజరయ్యారు.

వారు జాతీయవాదులు కాదు..
మూక దాడుల్లో పాల్గొనేవారు, విద్వేశాన్ని రెచ్చగొట్టేవారు జాతీయవాదులు కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అమెరికాకు వెళ్లేముందు పీటీఐ వార్తా సంస్థకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే.. మూక దాడుల ఘటనలను రాజకీయం చేయొద్దని, ఈ ఘటనలను కొన్ని రాజకీయపార్టీలకు అంటగట్టడం విచారకరమని అన్నారు. ‘‘సమాజం వైఖరిలో మార్పు రావాల్సి ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ వల్ల ఈ ఘటనలు చోటు చేసుకోవడం లేదు. దాడుల ఘటనను ఒక పార్టీకి అంటగడితే.. ఆ దాడుల సమస్య తీవ్రత తగ్గిపోతుంది. అలా జరగకూడదు’’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

హిందూ కాంగ్రెస్‌లో ‘ఐక్యత లడ్డూలు’
అమెరికాలోని షికాగోలో జరుగుతన్న ‘ప్రపంచ హిందూ కాంగ్రెస్ (డబ్ల్యూహెచ్‌సీ) సమావేశాలకు హాజరైన ప్రతినిధులకు నిర్వాహకులు అనూహ్యమైన బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ప్రతినిధులకు గిఫ్ట్‌బాక్స్ కింద అందించిన లడ్డూలకు ఐక్యత లడ్డూలు అని పేరు పెట్టారు. ఆ బాక్స్‌లో రెండు లడ్డూలు ఉండగా.. ఒక దానికి ‘మృదువైన’ లడ్డూ, రెండో దానిని ‘కఠినమైన’ లడ్డూ అని పేరు పెట్టారు. హిందువులు ఐక్యంగా ఉంటూనే.. అవసరమైన సందర్భంలో మృదువుగా, కఠినంగా ఉండాలని సూచిస్తూ వాటికి ఆ పేర్లు పెట్టామని నిర్వాహకులు తెలిపారు.  అలాగే.. హిందువులు ఐక్యంగా లేరనే విషయాన్ని కూడా పరోక్షంగా గుర్తు చేస్తూ దాని అవసరాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తు చేశామని చెప్పారు. ‘మృదువైన లడ్డూను తొందరగా చితక్కొట్టి తినవచ్చు. కానీ..హిందువులు భవిష్యత్తులో గట్టి లడ్డూలా ఉండాలి. దానిని విడదీని తినడం చాలా కష్టం. ఆ ఉద్దేశంతోనే వినూత్న తరహాలో లడ్డూలను పంచాం’ అని నిర్వాహకులు తెలిపారు. దడ పుట్టిస్తున్న స్థలాల ధరలు

Updated By ManamThu, 03/15/2018 - 22:08

venkaiah-naiduన్యూఢిల్లీ: మందగమనం కొంత కాలం కొనసాగిన తర్వాత, స్థిరాస్తుల రంగం పునరుద్ధరణ సంకేతాలు ఇస్తోందని, కానీ, స్థలాల ధరలు, ముఖ్యంగా, చిన్న నగరాల్లో అధిక స్థాయిల్లో ఉండడం ఆందోళన కలిగిస్తోందని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. రియల్టర్ల సంస్థ ‘క్రెడాయ్’ వార్షిక సదస్సులో ఆయన గురువారం ప్రసంగించారు. స్వీయ ప్రవర్తనా నియుమావళిని పాటించవలసిందని, రాత్రికి రాత్రి దుకాణాలు తెరచి అంతే హఠాత్తుగా అదృశ్యమైపోయే వ్యక్తులను దూరం పెట్టవలసిందని ఆయన ‘క్రెడాయ్’ని కోరారు. స్థిరాస్తుల రంగ మార్కెట్ శుభ సంకేతాలు ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తాయని ఆయన అన్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది భవన నిర్మాణ, స్థిరాస్తుల రంగవేునని ఆయన చెప్పారు. నూతన స్థిరాస్తుల చట్టం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రిరా) నిర్దేశిస్తున్న ఉత్తమ విధానాలను అమలుపరచడంలో ‘క్రెడాయ్’ పూర్తిగా సన్నద్ధమై ఉండగలదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘నియంత్రణ లేకపోతే, విజయ్ మాల్యాలు, నీరవ్ మోదీలు వంటివారు పుట్టుకొస్తా’’రని ఉప రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. తాను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సవుయంలోనే ఆ స్థిరాస్తుల చట్టం ఆమోదం పొందిన సంగతిని ఆయన గుర్తు చేశారు. గత ఏడాది మే నుంచి అమలులోకి వచ్చిన ఈ చట్టం ఆస్తుల రంగానికి ఎంతో అవసరమైన పారదర్శకతను తీసుకురావాలని కోరుకుంటోంది. విజయవాడ, తదితర ప్రదేశాల్లో స్థలాల ధరలు న్యూయార్క్, వాషింగ్టన్‌లలోని వాటితో సమానంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందని వెంకయ్య నాయుడు అన్నారు. స్థలం ధర అధికంగా ఉండడంతో, గృహ నిర్మాణ వ్యయం పెరిగిపోతోందన్నారు. ప్లాట్లు ఎక్కువగా దళారీల చేతుల్లో ఉన్నాయని, ‘‘ధరల దిద్దుబాటు అవసరం’’ ఉందని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలోకి రియాలిటీ (వాస్తవికత) రావలసిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం కోటి 90 లక్షల గృహాలకు కొరత ఉందని, అది 2030 నాటికి 3 కోట్ల 80 లక్షలకు చేరగలదనే అంచనా ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఈ విషయంలో ప్రైవేటు సంస్థలు వహించవలసిన పాత్ర ఎంతో ఉందని, పర్యావరణం పేరుతో అభివృద్ధికి అవరోధాలు కల్పించకుండా, గృహ నిర్మాణ ప్రాజెక్టులకు జాప్యం చేయకుండా స్థానిక పాలనా సంస్థలు అనుమతులు ఇవ్వాలని ఉప రాష్ట్రపతి కోరారు. 

Related News